- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Nellore: నా తండ్రి సాక్షిగా చెబుతున్నా.. ఆయనతోనే ఉంటా: అనిల్ కుమార్
దిశ, డైనమిక్ బ్యూరో: ‘రాజకీయాల్లో ఉన్నంత కాలం నా చివరి శ్వాస వరకు జగన్ వెంటే ఉంటా.. జగన్ కోసమే పని చేస్తా. జగనన్న నన్ను తరిమేసినా.. తిట్టినా.. నువ్వు ఈ పార్టీలో ఉండొద్దని చెప్పినా.. నా తండ్రి సాక్షిగా చెబుతున్నా. నేను జగన్ వెంటే ఉంటా’ అని వైసీపీ నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ వెల్లడించారు. చచ్చే వరకు వైసీపీలోనే ఉంటానని వేరే గుమ్మం తొక్కే ప్రసక్తే లేదని చెప్పారు. ‘సీఎం వైఎస్ జగన్ నాకు ఒక వ్యసనం. ఆయన కోసం ఏమైనా చేస్తా. నేను ఎమ్మెల్యే అయినా.. మంత్రి అయినా అది నాకు జగన్ బిక్ష.’ అని అనిల్ కుమార్ యాదవ్ అన్నారు.
కాగా వైసీపీలో చాలా మంది అసంతృప్తితో ఉన్నారంటూ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ వ్యాఖ్యలు చేశారంటూ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందుకు అనిల్ కుమార్ వివరణ ఇచ్చారు. ‘నేను రాజకీయంగా కొందరితో దూరంగా ఉంటున్నా. ఒక మనిషిపై మనకు మంచి అభిప్రాయం లేనప్పుడు దూరంగా ఉండటం మేలు. ఒక పెళ్లికి వెళ్లి అక్షింతలు వేసి తాళి ఎప్పుడు తెగుతుందా అని దీవించే కన్నా పెళ్లికి వెళ్లకపోవడమే మేలని భావించే వ్యక్తిని నేను. పక్క పక్కన కూర్చుని వీడు ఎప్పుడు నాశనం అయిపోతాడా అని కోరుకునే బదులు దూరంగా ఉండడమే గౌరవం. దాని ప్రకారమే నేను నడుచుకుంటున్నా.. అందుకే కొందరితో విభేదాలు ఉన్నాయి. పేరున్న గొర్రె కన్నా ఒంటరిగా సింహంగా ఉండటం మేలు.’ అని అనిల్ కుమార్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
నా భవిష్యత్తును నిర్ణయించేది జగనే
గత ఏడాది కాలంగా తనపై కొందరు వైసీపీ నేతలు రకరకాలుగా ప్రచారం చేస్తున్నారని అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. సమయం వచ్చినప్పుడు అవన్నీ సీఎం జగన్‌కు చెప్తానని వెల్లడించారు. బాధ కలిగితే ఖచ్చితంగా సీఎం జగన్ చెప్పుకుంటానని స్పష్టం చేశారు. ‘అనిల్.. నెల్లూరు సిటీలో ఓడిపోతావు.. నువ్వు తప్పుకో అని సీఎం జగన్ చెబితే బంగారంగా తప్పుకుంటానని అందులో ఎలాంటి సందేహం లేదని.’ అని ఆయన చెప్పారు. ‘ ఇది నాకు జగన్ ఇచ్చిన పదవి.. ఆయన తీసుకుంటానంటే ఎలాంటి అభ్యంతరం చెప్పను. రాజకీయాల్లో నా భవిష్యత్తును ఆ భగవంతుడు, జగన్మోహన్ రెడ్డి, నెల్లూరు ప్రజలు నిర్ణయిస్తారు. అనారోగ్యం కారణంగా కొన్ని రోజులు గడపగడపకు ప్రభుత్వం కార్యక్రమాన్ని ఆపుతున్నా.’ అని చెప్పారు. వైసీపీలో ఎక్కువ మంది ఎమ్మెల్యేలు గెలవరని తాను మాట్లాడినట్లు వస్తున్న వార్త ఫేక్ న్యూస్ అని ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ క్లారిటీ ఇచ్చారు.
Also Read..