- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Home > ఆంధ్రప్రదేశ్ > శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా > Nellore: కుక్కల దాడిలో 15 మేక పిల్లల మృతి
Nellore: కుక్కల దాడిలో 15 మేక పిల్లల మృతి
by srinivas |
X
దిశ, సంగం: కుక్కల దాడిలో 15 మేక పిల్లలు మృతి చెదిన ఘటన సంగం మండలం పెరమున గ్రామంలో చోటుచేసుకుంది. పెరమునకు చెందిన వన్నె ధర్మయ్య మేక పిల్లలను చూసుకుంటూ వాటిని పోషించి అమ్ముకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఇటీవల 21 మేక పిల్లలను ధర్మయ్య కొనుగోలు చేసి పెంచుకుంటున్నారు. అయితే వీధి కుక్కలు దాడి చేసి 15 మేకపిల్లలను దొడ్డిలోనే చంపేశాయి. కుక్కల దాడికి బెదిరిపోయి 9 మేక పిల్లలు పారిపోగా వాటిలో నాలుగు దొరికాయి. 15 మేక పిల్లలు విగతజీవులుగా కనిపించడంతో ధర్మయ్య కన్నీరుమున్నిరయ్యారు. ఇటీవలే రూ.1.50 లక్షలు అప్పు చేసి మరీ మేకపిల్లలను కొన్నానని, వీటి మృతి వల్ల అప్పు మిగిలిపోగా కుటుంబ పోషణ భారమైందని ధర్మయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తనకు న్యాయం చేయాలని కోరుతున్నారు.
Advertisement
Next Story