- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Minister Narayana:పెండింగ్ దరఖాస్తుల పై ఏపీ సర్కార్ స్పెషల్ ఫోకస్!
దిశ,వెబ్‌డెస్క్:ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధి(State Development) దిశగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు(CM Chandrababu) ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల పై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ క్రమంలో భవన నిర్మాణాలు(Building structures), లే అవుట్లు, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ల జారీ పై ఏపీ ప్రభుత్వం(AP Government) స్పెషల్ ఫోకస్ పెట్టింది. అన్ని రకాల ఫీజులు చెల్లించి, సరైన డాక్యుమెంట్లు ఉన్నప్పటికీ ఆన్‌లైన్‌లో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల తక్షణ పరిష్కారానికి మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ(Minister Narayana) కీలక నిర్ణయం తీసుకున్నారు.
ఈ నేపథ్యంలో త్వరితగతిన దరఖాస్తులు పరిష్కరించేలా ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటుకు పట్టణ ప్రణాళిక విభాగానికి ఆదేశాలు జారీ చేశారు. మంత్రి నారాయణ ఆదేశాలతో దరఖాస్తుల పరిష్కారానికి ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేసింది టౌన్ ప్లానింగ్ విభాగం.. 9398733100, 9398733101 నంబర్లకు వాట్సాప్ ద్వారా వివరాలు పంపవచ్చని వెల్లడించింది. అన్ని పనిదినాల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5.30 వరకు పని చేయనుంది. ఈ ప్రత్యేక విభాగం నిబంధనల ప్రకారం ఏపీ ప్రభుత్వం(AP Government) అన్ని రకాల డాక్యుమెంట్లు ఉండి ఫీజు చెల్లించినట్లు అయితే వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోనుంది.