- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఏపీలో ఆ రోజే అన్న క్యాంటీన్లు ప్రారంభం..స్పీకర్ అయ్యన్నపాత్రుడు వెల్లడి
దిశ ప్రతినిధి,అనకాపల్లి:ఆగష్టు 15 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్న క్యాంటీన్లు ప్రారంభించేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని, నియోజకవర్గానికి ఒకటి చొప్పున అన్నిచోట్ల వీటిని ప్రారంభించేందుకు అవసరమైన చర్యలు తీసుకున్నట్లు స్పీకర్ అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు. నర్సీపట్నంలో ఏర్పాటు చేస్తున్న అన్నా క్యాంటిన్ పనులను ఆయన సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన వ్యక్తిగత పనుల వల్ల నర్సీపట్నంలో నాలుగు రోజులు ముందుగానే ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.
తమ స్వంత అవసరాల మీద పట్టణ ప్రాంతాలకు వచ్చే పేదలకు తక్కువ ధరకు భోజనం అందించడమే అన్న క్యాంటిన్ల ఉద్దేశ్యమని ఆయన పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో వీటన్నింటినీ మూసివేయడమే కాకుండా, కొన్ని చోట్ల ధ్వంసం చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అయినా టీడీపీ నాయకులు సొంత ఖర్చుతో రాష్ట్రంలో పలు చోట్ల వీటిని ఇప్పటికే నిర్వహిస్తున్నారన్నారు. అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో స్వాతంత్ర్య దినోత్సవ రోజు నుంచి పూర్తిస్థాయిలో నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందని స్పీకర్ అయ్యన్నపాత్రుడు వెల్లడించారు.