- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
సాప్ట్‌వేర్ రాధ మర్డర్ కేసులో సంచలన ట్విస్ట్.. అసలు హంతకుడు అతడే..!
దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాకు చెందిన సాఫ్ట్ వేర్ రాధ మర్డర్ కేసు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ కేసులో ఊహించని ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. మొదటగా సాప్ట్‌వేర్ ఇంజనీర్ రాధను డబ్బుల కోసం ఆమె స్నేహితుడే హత్య చేశాడని పోలీసులు అనుమానించగా.. తాజాగా పోలీసుల దర్యాప్తులో అసలు నిజం బయటపడింది. సాప్ట్‌వేర్ రాధను ఆమె భర్త మోహన్ రెడ్డినే హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ కేసులో అసలు హంతకుడు ఆమె భర్త మోహన్ రెడ్డి అని పోలీసులు కనుగొన్నారు.
దీంతో పోలీసులు మోహన్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. అయితే, తన స్నేహితుడికి రాధ రూ.51లక్షలు అప్పుగా ఇచ్చింది. దీంతో వారిద్దరి మధ్య ఏదో సంబంధం ఉందని రాధ భర్త మోహన్ రెడ్డి ఆమెపై అనుమానం పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలోనే రాధను హత్య చేసిన మోహన్ రెడ్డి.. కేసును రాధ స్నేహితుడు కాశిరెడ్డిపైకి నెట్టివేసే ప్రయత్నం చేశాడని పోలీసులు వెల్లడించారు. ఇదిలా ఉంటే.. ఇన్సూరెన్స్ డబ్బుల కోసమే మోహన్ రెడ్డి రాధను హత్య చేశాడని ఆమె తరుపు బంధువులు ఆరోపిస్తున్నారు.