Skill development scam case: మాజీ ఎంపీ ఉండవల్లి పిటిషన్ వేరే బెంచ్‌కు బదిలీ

by Seetharam |   ( Updated:2023-09-27 11:26:05.0  )
Skill development scam case:  మాజీ ఎంపీ ఉండవల్లి పిటిషన్ వేరే బెంచ్‌కు బదిలీ
X

దిశ, డైనమిక్ బ్యూరో : ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసు విచారణను సీబీఐకి అప్పగించాలంటూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఏపీ హైకోర్టులో పిల్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ స్కాంలో అంతరాష్ట్ర సమస్యలు ఉన్నాయని ఈ పరిస్థితుల నేపథ్యంలో విచారణ సీఐడీతో కాకుండా సీబీఐతో విచారించాలంటూ పిల్‌లో కోరారు. ఈ పిల్ బుధవారం జడ్జి జస్టిస్ రఘునందరావు ముందుకు వచ్చింది. ఈ పిటిషన్‌ను వేరే బెంచ్‌కు బదిలీ చేయాలని జడ్జి రఘునందన్ రావు హైకోర్టు బెంచ్ రిజిస్ట్రీని ఆదేశించారు. నాట్ బిఫోర్ మీ అంటూ జడ్జి కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో హఐకోర్టు బెంచ్ రిజిస్ట్రీ ఏ బెంచ్ ఈ కేసుపై విచారణ చేపట్టాలనేది నిర్ణయించాల్సి ఉంది. దీనిపై నేడు లేదా రేపు స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఉండవల్లిపై టీడీపీ శ్రేణుల ఆగ్రహం

ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసును సీఐడీ విచారిస్తోంది. విజయవాడ ఏసీబీ కోర్టు స్కిల్ స్కామ్ కేసులను విచారించి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు రిమాండ్ సైతం విధించిన సంగతి తెలిసిందే. ఇంతలో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సీన్‌లోకి వచ్చారు. ఈ కేసును సీఐడీతో కాకుండా సీబీఐతో విచారించాలంటూ పిల్ దాఖలు చేశారు. ఈ స్కాంలో అంతరాష్ట్ర సమస్యలున్నాయని ఆరోపించారు. ఇది తీవ్రమైన ఆర్ధిక నేరంగా పరిగణించాలని పిల్‌లో కోరారు.ఈ కేసును సీబీఐతో నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయడం మంచిదని ఉండవల్లి అరుణ్ కుమార్ అభిప్రాయపడ్డారు. చంద్రబాబు నాయుడు అరెస్ట్ అక్రమమని టీడీపీ ఆరోపిస్తున్న వేళ ఉండవల్లి అరుణ్ కుమార్ ఈ కేసు విచారణను ఏకంగా సీబీఐకు అప్పగించాలంటూ పిటిషన్ దాఖలు చేయడంపై టీడీపీ శ్రేణులు భగ్గుమంటున్నారు. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్‌పై మండిపడుతున్నారు. వైసీపీ ప్రభుత్వంలో అనేక స్కాంలు జరుగుతున్నాయని అవి కనిపించలేదా అని ప్రశ్నిస్తున్నారు. మైనింగ్, శాండ్, ల్యాండ్ ఇలా అనేక అక్రమాలు జరుగుతున్నాయని వాటిపై ఏనాడూ స్పందించని ఉండవల్లి అరుణ్ కుమార్ నేడు చంద్రబాబు స్కిల్ స్కామ్ కేసులో జోక్యం చేసుకోవడం సీఎం వైఎస్ జగన్‌తో మిలాఖత్‌కు నిదర్శనం అని మండిపడుతున్నారు.

Read More Latest updates of Andhra Pradesh News

Advertisement

Next Story