షాకింగ్ న్యూస్.. వైసీపీ అభ్యర్థి ఇంటికెళ్లిన టీడీపీ ఎమ్మెల్యే?

by Jakkula Mamatha |
షాకింగ్ న్యూస్.. వైసీపీ అభ్యర్థి ఇంటికెళ్లిన టీడీపీ ఎమ్మెల్యే?
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ కూటమి భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. కాగా ఈ ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమిని చవిచూసింది. తాజాగా రాష్ట్ర రాజకీయాల్లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. రాజకీయాల్లో సరికొత్త సంస్కృతికి మడకశిర ఎమ్మెల్యే MS రాజు నాంది పలికారు. ఎన్నికల్లో తనపై ఓడిపోయిన వైసీపీ అభ్యర్థి ఈర లక్కప్ప ఇంటికి వెళ్లారు. అసెంబ్లీ ఎన్నికల్లో 350 ఓట్ల తేడాతో లక్కప్ప పై ఎమ్మెస్ రాజు గెలుపొందిన విషయం తెలిసిందే. శుక్రవారం ఈర లక్కప్ప ఇంటికి వెళ్లి ఆయనను టీడీపీ ఎమ్మెల్యే పలకరించారు. ఎమ్మెస్ రాజును ఈర లక్కప్ప సైతం సాదరంగా ఆహ్వానించారు. ఈ క్రమంలో వారివురు రాజకీయాల గురించి మాట్లాడుకున్నారు. రాజకీయాలు ఎన్నికలప్పుడు మాత్రమేనని, ఆ తర్వాత అందరూ ప్రజల కోసం కలిసి పని చేయాలని అభిప్రాయపడ్డారు. పాలిటిక్స్‌లో ఇలాంటి సానుకూల వాతావరంణం ఉండాలని నెటిజన్లు పేర్కొంటున్నారు.

Advertisement

Next Story