మంత్రి రోజాకు షాక్... సెల్వమణికి అరెస్ట్ వారెంట్

by Seetharam |   ( Updated:2023-08-29 06:33:42.0  )
మంత్రి రోజాకు షాక్... సెల్వమణికి అరెస్ట్ వారెంట్
X

దిశ, డైనమిక్ బ్యూరో : రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్‌కే రోజా భర్త సెల్వమణికి షాక్ తగిలింది. చెన్నై జార్జిటౌన్ కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. సెల్వమణి తన పరువుకి భంగం కలిగేలా వ్యాఖ్యలు చేశాడని సినీ ఫైనాన్షియర్ ముకుంద్ చంద్ బోత్రా కోర్టును ఆశ్రయించారు. దీంతో చెన్నై జార్జిటౌన్ కోర్టులో విచారణ జరిగింది. అయితే ఈ కేసు విచారణకు సెల్వమణి కానీ ఆయన తరఫు న్యాయవాది కానీ విచారణకు హాజరుకాలేదు. దీంతో చెన్నై జార్జిటౌన్ కోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఈ మేరకు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.

Advertisement

Next Story