- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కువైట్‌లో ఇరుక్కుపోయానని వీడియో.. స్పందించిన మంత్రి నారా లోకేష్.. క్షేమంగా ఇంటికి చేరిన శివ
దిశ, వెబ్‌డెస్క్: ఓ ఏజెంట్ కారణంగా మోసపోయి కువైట్ లో ఎడారిలో ఇరుక్కున్నానని.. తనను చిత్రహింసలు పెడుతున్నారని.. తనకు చావే దిక్కని.. ఓ వీడియోను శివ అనే వ్యక్తి కువైట్ నుంచి పోస్ట్ చేశాడు. వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో శ్రీకాకుళం ఎంపీ బైరెడ్డి శబరి, మంత్రి నారా లోకేష్ చూసి స్పందించారు. వెంటనే నారా లోకేష్ కువైట్ లో ఉన్న తెలుగు వాళ్లకు సమాచారం అందించారు. అలాగే విదేశాంగ శాఖ తో చర్చలు జరిపి శివను ఇంటికి చేరుస్తామని హామీ ఇచ్చారు. దీంతో వెంటనే కువైట్ లో ఉన్న భారతీయులు సదరు వ్యక్తిని భారత ఎంబసీ కి తీసుకెళ్లగా అక్కడ లీగల్ సమస్యలను పరిష్కరించుకొని బుధవారం భారత్ కు తిరిగి వచ్చాడు. ఈ సందర్భంగా ఎయిర్ పోర్టులో అతని భార్య బిడ్డలు అతన్ని పట్టుకుని బిగ్గరగా ఎడ్చారు. ఈ వీడియోను అక్కడే ఉన్న మరో వ్యక్తి తన ఫోన్ లో రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఆ వీడియోకు నెటిజన్లు స్పందిస్తూ.. నాయకులు, యంత్రాంగం, అధికారాన్ని సరైన సమయంలో ఉపయోగించడం వలన శివ వారం రోజుల్లోపు ఇంటికి క్షేమంగా చేరుకున్నాడని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.