- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Breaking:ఏపీలో ఎక్కడ చూసిన హత్యలే..జగన్ పై షర్మిల ఫైర్
దిశ,వెబ్‌డెస్క్: వైఎస్సార్సీపీ ప్రభుత్వం పై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల సంచలన ఆరోపణలు చేశారు. వైసీపీ ప్రభుత్వం హత్య రాజకీయాలు ప్రోత్సహిస్తుందనీ విమర్శించారు. రాష్ట్రంలో దోపిడీలు పెరిగిపోయాయని వైఎస్ షర్మిల సీఎం జగన్ పై ధ్వజమెత్తారు. కాంగ్రెస్ చేపట్టిన ఏపీ న్యాయ యాత్రలో భాగంగా ఆదివారం నాడు కమలాపురం నియోజకవర్గంలో వైఎస్ షర్మిల పర్యటించారు. పెండ్లిమర్రి మండలం, నంది మండలం గ్రామంలో వైఎస్ షర్మిలను కాంగ్రెస్ కార్యకర్తలు, ప్రజలు ఘనంగా స్వాగతించారు.
ఈ క్రమంలో యాదవపురం గ్రామంలో శ్రీనివాస్ యాదవ్ కుటుంబాన్ని పరామర్శించారు. వారి అండగా ఉంటానని హామీ ఇచ్చారు.ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ.. భూమి కోసం ఎంపీ అవినాష్ రెడ్డి అనుచరులు శ్రీనివాస్ యాదవ్‌ను హత్య చేశారని మండిపడ్డారు. రాళ్లతో కొట్టి దారుణంగా చంపారని ఆవేదన వ్యక్తం చేశారు. అటువంటి వ్యక్తికే ఈ ఎన్నికల్లో మళ్లీ జగన్మోహన్ రెడ్డి టికెట్ ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. నిజంగా ఇది హత్యా రాజకీయాలను ప్రోత్సహించినట్లేనని ఆగ్రహం వ్యక్తం చేశారు.
హత్య చేసిన నిందితులను గెలిపించాలని జగన్ చూస్తున్నారని చెప్పారు. వివేకా హత్యపై కనీసం న్యాయం చేసే పరిస్థితి లేదని మండిపడ్డారు. నిందితులను దగ్గరుండి మరీ కాపాడుతున్నారని ఏకిపారేశారు.ఈ క్రమంలో న్యాయం ఒకవైపు,అధర్మం ఒక వైపు..ఒకవైపు ధర్మం, మరో వైపు డబ్బు ఉందన్నారు. ఈ ఎన్నికల్ల ఎవరిని గెలిపించాలో ప్రజలు ఆలోచించాలని వైఎస్ షర్మిల అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.