రాష్ట్రంలో సంచలన ఘటన..వీడియోలు తీస్తూ మతిస్థిమితం లేని యువతిపై లైంగిక దాడి

by Mahesh |
రాష్ట్రంలో సంచలన ఘటన..వీడియోలు తీస్తూ మతిస్థిమితం లేని యువతిపై లైంగిక దాడి
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చినప్పటికి మహిళలపై లైంగిక దాడులు జరుగుతూనే ఉన్నాయి. ప్రతి రోజు దేశంలో ఏదో ఒక ప్రాంతంలో లైంగిక దాడిలు చేస్తూనే ఉన్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ లోని నంద్యాల జిల్లాలో మరో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. కోవేలకుంట అనే ప్రాంతంలో మతిస్థిమితం లేని ఓ యువతిపై ముగ్గురు యువకులు లైంగిక దాడి చేశారు. మతిస్థిమితం లేని యువతికి మాయమాటలు చెప్పి స్థానికంగా ఉన్న ఓ పాడుబడిన భవనం లోకి తీసుకెళ్లారు. అనంతరం అక్కడ ఫోటోలు, వీడియోలు తీస్తూ.. యువతిపై ఈ నెల 24న లైంగిక దాడికి పాల్పడ్డారు. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయిన నిందితులు.. తమ ఫొన్‌లలో ఉన్న ఫోటోలు, వీడియోలను తోటి స్నేహితుకుల షేర్ చేశారు. దీంతో ఆ వీడియోలు, ఫోటోలు వైరల్ గా మారడంతో విషయం బయటకు వచ్చింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి.. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. కాగా మతిస్థిమితం లేని యువతిపై లైంగిక దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజల నుంచి డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

Next Story