- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
విజయనగరం రైలు ప్రమాద ఘటనలో ఏడుగురు మృతి, 40 మందికి తీవ్ర గాయాలు
X
దిశ, వెబ్‌డెస్క్: విజయనగరం సమీపంలో కంటకాపల్లి వద్ద రెండు రైళ్లు ఢీకొట్టుకున్న ఘటనలో ఏడుగురు మృతి చెందారు. అలాగే 40 మందికి గాయాలయ్యాయి. ఈ ఘటనపై ఏపీ సీఎం జగన్ స్పందించారు. రైలు ప్రమాదంపై దిగ్బ్రాంతి వ్యక్తం చేసిన జగన్.. మృతులకు సంతాపం ప్రకటించారు. అలాగే మృతుల కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. సహాయక చర్యలను ముమ్మరం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వెంటనే సహాయక చర్యలను చేపట్టాలని ఆదేశించారు.
విశాఖపట్నం, అనకాపల్లి నుంచి వీలైనన్ని అంబులెన్స్‌లు పంపించాలని ఆదేశాలు జారీ చేశారు. బాధితులకు మెరుగైన వైద్య చికిత్సలు అందించాలని ఆదేశించారు. వైద్య, పోలీస్, రెవెన్యూ, ఇతర విభాగాలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఘటనకు సంబంధించి తనకు ఎప్పటికప్పుడు రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశించారు.
Advertisement
Next Story