AP Government:అన్న క్యాంటీన్ల ఫుడ్ సప్లై బాధ్యతల పై ప్రభుత్వం సంచలన నిర్ణయం!

by Jakkula Mamatha |
AP Government:అన్న క్యాంటీన్ల ఫుడ్ సప్లై బాధ్యతల పై ప్రభుత్వం సంచలన నిర్ణయం!
X

దిశ,వెబ్‌డెస్క్:ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమం దిశగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత చంద్రబాబు సంతకాలు చేసిన ఫైళ్లలో అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ ఫైల్ కూడా ఉంది. రాష్ట్రంలో గత వైసీపీ ప్రభుత్వం మూసివేసిన అన్న క్యాంటీన్లను తిరిగి తెరిచేందుకు కూటమి ప్రభుత్వం ముమ్మరంగా చేస్తోంది. ఈ నేపథ్యంలో ఆగస్టు 15వ తేదీన 100 అన్న క్యాంటీన్లను ప్రారంభిస్తామని మున్సిపల్ శాఖ మంత్రి పి. నారాయణ వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ నెల 15న ప్రారంభించనున్న అన్న క్యాంటీన్లకు ఆహార సరఫరా బాధ్యతలను హరేకృష్ణ ఫౌండేషన్‌కు రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనం సప్లై చేసేలా కాంట్రాక్టును ఈ సంస్థ దక్కించుకుంది. భవన నిర్మాణ పనులు పూర్తి కాకపోవడంతో తొలి విడతలో 100, రెండో విడతలో 83, మూడో విడతలో 20 క్యాంటీన్లను ప్రభుత్వం ప్రారంభించనుంది.

Advertisement

Next Story

Most Viewed