- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
నాకు చెప్పకుండా ఆ పని ఎలా చేస్తారు..? ఎమ్మెల్యే తిప్పేస్వామి ఫైర్
దిశ, డైనమిక్ బ్యూరో:ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్యే రాసిన లేఖ సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.వివరాల్లోకి వెళ్తే.. శ్రీ సత్యసాయి జిల్లా లోని మడకశిర నియోజకవర్గం లో వైసీపీ పరిశీలకుడు ఆశోక్ కుమార్ నేతృత్వంలో కార్యకర్తల సమావేశం జరిగింది. అయితే ముందుగా ఆ సమావేశం గురించిన సమాచారం అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే తిప్పేస్వామికి ఇవ్వలేదు. దీనితో ఆగ్రహానికి గురైన తిప్పేస్వామి పరిశీలకుడు ఆశోక్ కుమార్ కు లేఖ రాశారు.
ఈ సమావేశం ద్వారా దళిత వర్గానికి ఏం సందేశం అందించాలి అనుకున్నారో తెలియజేయాలని.. ఎన్నికల సమయంలో ఇదీ పార్టీకి తీవ్ర నష్టం కలిగించదా..? అని ప్రశ్నిస్తూ లేఖ రాసారు. కాగా ఎమ్మెల్యే తిప్పేస్వామి రాసిన లేఖ ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. సమాచారం అందించకుండా సమావేశం నిర్వహించడం పై స్పందించిన తిప్పేస్వామి మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన తనకు సమావేశం గురించి ముందుగా సమాచారం ఇవ్వలేదని మండిపడ్డారు. విజయవాడలో ఉన్న తనకు సమావేశం గురించిన సమాచారం సమావేశం ప్రారంభించే కొన్ని గంటల ముందు మాత్రమే అందించారని ఆగ్రహానికి లోనైయ్యారు. ఆ సమావేశానికి తాను హాజరు కాకూడదనే ఉద్దెశంతోనే ఆలా చేశారని ఆరోపించారు.