- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
త్వరలోనే YCP ఖాళీ కావడం ఖాయం.. మాజీ మంత్రి గంటా సంచలన వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: త్వరలోనే వైసీపీ ఖాళీ కావడం ఖాయమని టీడీపీ మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ చేరికల గేట్లు ఓపెన్ చేస్తే వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు కూడా టీడీపీలో చేరుతారని కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీలో ఒకరిద్దరూ మినహా మిగతా వాళ్లంతా టీడీపీలోకి వస్తారని జోస్యం చెప్పారు. మాజీ సీఎం జగన్ తీరుతో వైసీపీ అనే నావ మునిగిపోయిందని ఎద్దేవా చేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీ అత్యంత ఘోర పరాభవం చూసిన తర్వాత కూడా జగన్ వైఖరిలో మార్పు రాలేదని ఫైర్ అయ్యారు. కాగా, టీడీపీ సీనియర్ నేత గంటా వ్యాఖ్యలు ప్రస్తుతం ఏపీ పాలిటిక్స్‌లో హాట్ టాపిక్‌గా మారాయి.
164 సీట్లు సాధించి అఖండ విజయంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి.. వైసీపీ తరుఫున గెలిచిన 11 మంది ఎమ్మెల్యేలను చేర్చుకుంటుందా అనే కొత్త చర్చ తెరపైకి వచ్చింది. ప్రభుత్వం ఏర్పాటుకు కావాల్సిన మేజిక్ ఫిగర్ కంటే చాలా ఎక్కువ సీట్లు సాధించి గవర్నమెంట్ ఫామ్ చేసిన కూటమికి వైసీపీ ఎమ్మెల్యేల అవసరం లేదని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తుండగా.. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకుని ఇప్పటికే ఓటమితో ఢీలాపడ్డ జగన్‌ను చావుదెబ్బ కొట్టేందుకు అధికార కూటమి వ్యూహాలు రచిస్తోందని ప్రచారం జరుగుతోంది.