- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏపీ ఎన్నికల ఫలితాలు.. రఘువీరా జోస్యం ఇదే..
దిశ, వెబ్ డెస్క్: మే 13న రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ జరిగింది. జూన్ 4న ఫలితాలు విడుదల కాబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనే ప్రశ్నలు విపరీతంగా వినిపిస్తున్నాయి. దీంతో ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ సీనియర్ నేత రఘువీరా రెడ్డి జోస్యం చెప్పారు. వైసీపీ, కూటమి మధ్య పోటీ హోరాహోరీగా ఉందని తెలిపారు. ఏ పార్టీ గెలిచినా 95 నుంచి 97 సీట్లతోనే అధికారంలోకి వస్తాయని పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో డబ్బు ప్రవాహం కొనసాగిందని చెప్పారు. వైసీపీ, టీడీపీ రెండు వేల కోట్ల వరకూ ఖర్చు పెట్టాయన్నారు. సుమారు వంద స్థానాల్లో 10 వేల లోపు మెజార్టీలే వస్తాయని చెప్పారు. డబ్బు ప్రభావం లేని ఒకటి, రెండు స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్పారు. పార్లమెంట్ స్థానాల విషయానికి వచ్చే సరికి క్రాస్ ఓటింగ్ బాగా జరిగిందని కాంగ్రెస్ సీనియర్ నేత రఘువీరా రెడ్డి ఓ యూట్యూబ్ చానల్‌లో పేర్కొన్నారు.