Nara Lokesh: నా పేరు ఫోటోతో ఫేక్ ఐడి.. మెసేజ్ చేస్తే బ్లాక్ చేయండి: మంత్రి నారా లోకేష్

by Mahesh |   ( Updated:2024-10-23 12:11:43.0  )
Nara Lokesh: నా పేరు ఫోటోతో ఫేక్ ఐడి.. మెసేజ్ చేస్తే బ్లాక్ చేయండి: మంత్రి నారా లోకేష్
X

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి నారా లోకేష్(Minister Nara Lokesh) తన అనుచరులతో పాటు, కార్యకర్తలకు సైబర్ అలర్ట్(Cyber ​​Alert) జారీ చేశారు. తన పేరు, ఫోటో వాడుకొని ఎన్నారై టీడీపీ అనే ఫేక్ ఐడీతో మోసాలు చేస్తున్నరని ట్విట్టర్(Twitter) వేదికగా హెచ్చరికలు జారీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి తన ట్వీట్‌లో "నా పేరు, నా ఫోటో వాడుకుని ఎన్నారై TDP అనే ఫేక్ ఐడీతో మోసాలు చేస్తున్న మోస‌గాళ్లు మీకు ఈ క్రింది నెంబ‌ర్ల నుంచి మెసేజ్ చేస్తే వారిని బ్లాక్ చేయండి. నా టీం సభ్యులు ప్రజ‌ల స‌మ‌స్యలు ప‌రిష్కరించే ప‌నిలో బిజీగా ఉంటే.. మోస‌గాళ్లు కొంద‌రు.. నా వ‌ద్దకు సాయం కోరి వ‌చ్చే వారి డేటా దొంగిలించి, ఇటువంటి మోసాల‌కు పాల్పడుతున్నారు.

వీరిపై ఇప్పటికే మా సిబ్బంది పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. మా టీం @OfficeofNL నుంచి మాత్రమే బాధితుల స‌మాచారం అడిగి, వారికి కావాల్సిన స‌హాయం అందిస్తారు. ఇత‌ర‌త్రా ఏ నెంబ‌ర్ నుంచి ఫోన్ వ‌చ్చినా, లేదా మెసేజ్ వ‌చ్చినా, ఫోన్ పే చేయాల‌ని కోరినా, వేరే విధంగా డబ్బు పంపాలని కోరినా అది మోసగాళ్ల పని.. ఆ మెసేజ్ లకు ఎవరూ స్పందించ‌వ‌ద్దు. ఎవరు డబ్బులు అడిగినా తక్షణమే పోలీసులకు ఫిర్యాదు చేయండి." అని మంత్రి నారా లోకేష్ రాసుకొచ్చారు. ఇదిలా ఉంటే.. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం సాధించిన తర్వాత.. విదేశాల్లో వలస జీవులు ఎవరైనా ఇబ్బంది పడితే మంత్రి లోకేష్ ఎన్ఆర్ఐ టీమ్ సభ్యులతో వారిని ఆదుకుంటున్న విషయం తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed