అధికార పార్టీ ఎమ్మెల్యేకి గుండెపోటు

by Sathputhe Rajesh |
అధికార పార్టీ ఎమ్మెల్యేకి గుండెపోటు
X

దిశ, వెబ్‌డెస్క్: నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గుండెపోటుకు గురయ్యారు. దీంతో ఆయనను హుటాహుటిన నెల్లూరులోని అపోలో ఆస్పత్రికి తరలించారు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు చంద్రశేఖర్ రెడ్డి గుండె రక్తనాళాల్లో పూడికలు ఉన్నట్లు గుర్తించారు. కాగా ఎమ్మెల్యే పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. దీంతో ఆయనను మెరుగైన వైద్యం కోసం చెన్నైకి తరలించే యోచనలో కుటుంబసభ్యులు ఉన్నట్లు సమాచారం. కాగా ఇటీవల ఉదయగిరి వైసీపీ సమన్వయకర్త విషయంలో ఆయన సొంత పార్టీపైనే విమర్శలు చేయడం సంచలనంగా మారిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story