- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
RTC Bus Stand:అడవిలా దర్శనమిస్తున్న ఆర్టీసీ బస్టాండ్.. ప్రయాణికులకు తప్పని తిప్పలు
దిశ, కారంపూడి: ప్రజాప్రతినిధులు, అధికారులు ఉదాసీనత కారణంగా కారంపూడిలో ఆర్టీసీ బస్సు ప్రయాణికులకు కష్టాలు తప్పడం లేదు. వానొచ్చినా ఎండలు మండినా రోడ్లపైన నిలబడాల్సిందే. కూర్చోడానికి కాస్తంత స్థలం లేదు. చంటి పిల్లలు, వృద్ధుల పరిస్థితి మరీ దారుణం. రోడ్డుపైనే బస్సులు అవుతుండడంతో ట్రాఫిక్ కష్టాలు పెరుగుతున్నాయి. కారంపూడి మండల కేంద్రంలో మూడు దశాబ్దాల క్రితం పట్టణానికి దూరంగా లక్షల వ్యయంతో బస్టాండ్ నిర్మాణం చేపట్టారు. నాటి నుంచి నేటి వరకు అక్కడికి ప్రయాణికులు వెళ్లిన దాఖలాలు లేవు. నిరుపయోగంగా ప్రస్తుతం ఆ ఆర్టీసీ బస్టాండ్ శిథిలావస్థకు చేరింది. ఈ బస్టాండ్‌కు బస్సులు వెళ్ళక పోవడంతో ఇక్కడ బస్టాండ్ సైతం ప్రయాణికులకు అనుకూలంగా లేదు. దీంతో శిథిలావస్థకు చేరిన బస్టాండ్. దీని ప్రాంగణమంతా, చెట్లు బాగా ఏపుగా పెరిగి ఒక అడవిలా దర్శనం ఇస్తుంది.
కారంపూడి నుంచి గుంటూరు, వినుకొండ, చిలకలూరిపేట, మాచర్ల, హైదరాబాద్ ప్రాంతాలకు వెళ్లేందుకు ప్రయాణికులు బస్సుల కోసం ఎదురు చూస్తుంటారు. ఇలా రోడ్డుపై ప్రయాణికులకు కనీస సౌకర్యాలు కరువయ్యాయి. గంటల పాటు రోడ్డుపై నిలబడే ఉంటున్నారు. అంతేకాకుండా కూడలిలో వ్యాపార సముదాయాల ముందు మహిళలు నిలబడి ఉంటున్నారు. ప్రయాణికులకు నీడ సౌకర్యం లేక అసౌకర్యానికి గురవుతున్నారు. మరో వైపు రోడ్డుపై బస్సులు నిలవడంతో ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. దృష్టి సారిస్తే ప్రయోజనం ఉంటుంది. బస్సులు తిరుగుతున్న ప్రయాణికులకు మాత్రం కనీస వసతులు కల్పించడంలో అధికార యంత్రాంగం విఫలమవుతోంది. కారంపూడి మండల కేంద్రంలో జూనియర్ కళాశాల స్కూల్ ఉండగా నిత్యం వందలాది ప్రజలు, విద్యార్థులు ప్రయాణం సాగించే కారంపూడి మండల కేంద్రంలో ప్రయాణ ప్రాంగణం కరువైంది. ఆర్టీసీ ఉన్నతాధికారులు బస్టాండ్ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.