- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Sarangapani Jatakam: ఉల్లాసంగా & వినోదాత్మకంగా ‘సారంగపాణి జాతకం’ టీజర్.. మీరు చూశారా?
దిశ, సినిమా: యంగ్ నటుడు ప్రియదర్శి (Priyadarshi) ‘బలగం’ చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. దీంతో ప్రజెంట్ వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. ఈ ఏడాది ‘ఓం భీమ్ బుష్, డార్లింగ్, 35 చిన్న కథ కాదు’ వంటి మూవీస్‌తో అలరించిన ప్రియదర్శి.. ఇప్పుడు మరో కొత్త కాన్సెప్ట్ (New Concept)తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నాడు. ఇంద్రగంటి మోహన కృష్ణ (Indraganti Mohana Krishna) దర్శకత్వం వహిస్తున్న ‘సారంగపాణి జాతకం’ (Sarangapani Jatakam)లో ప్రియదర్శి ప్రధాన పాత్రలో కనిపించనున్నాడు. రూపా కొడువయూర్ ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తున్న ఈ చిత్రాన్ని శివలెంక కృష్ణ ప్రసాద్ (Sivalenka Krishna Prasad) నిర్మిస్తున్నారు.
తాజాగా ఈ చిత్రం నుంచి టీజర్ (teaser) రిలీజ్ చేశారు చిత్ర బృందం. ‘మన జీవితం మొత్తం చేతిలోనే రాసి ఉంటుంది.. ఈ రోజు మధ్యాహ్నం మీరు ఊహించని అద్భుతం జరుగుతోంది’ అనే డైలాగ్‌తో స్టార్ట్ అయిన ఈ టీజర్.. సారంగ పాణి జాతకం, జీవితం చుట్టూ తిరిగే ఫన్నీ ఎలిమెంట్స్ (Funny Elements)తో ఎంతో ఉల్లాసంగా & వినోదాత్మకంగా సాగింది. అసలు భవిష్యత్తు అనేది మన చేతిల్లో ఉంటుందా.. చేతి గీతల్లో ఉంటుందా అనే కాన్సెప్ట్‌తో ఈ చిత్రం తెరకెక్కుతున్నట్లు తెలుస్తుండగా.. డిసెంబర్ 20న ‘సారంగపాణి జాతకం’ థియేటర్‌లలో రిలీజ్ కాబోతున్నట్లు అనౌన్స్‌మెంట్ ఇచ్చారు.