Profile Lock : సోషల్ మీడియా అకౌంట్లకు ప్రొఫైల్ లాక్ కంపల్సరీ! పోలీసుల హెచ్చరిక

by Ramesh N |
Profile Lock : సోషల్ మీడియా అకౌంట్లకు ప్రొఫైల్ లాక్ కంపల్సరీ! పోలీసుల హెచ్చరిక
X

దిశ, డైనమిక్ బ్యూరో: అందరి చేతిలో స్మార్ట్ ఫోన్.. అందులో ఇన్‌స్టా, యూట్యూబ్, ఫెస్‌బుక్ లాంటి చాలా సోషల్ మీడియా యాప్స్ ఉంటాయి. వీటిలో చిన్న పెద్ద తేడా లేకుండా దాదాపు అందరికీ అకౌంట్లు ఉంటాయి. అందులో తెలిసిన వ్యక్తులు, తెలియని వ్యక్తులతో పరిచయాలు, చాటింగ్ చేయడం, ఫ్రెండ్ రిక్వెస్ట్, ఫోటోలు పంపడం చేస్తూంటారు. కొంత మంది తెలియని వ్యక్తులతో అతిగా పరిచయం పెంచుకొని చివరికి మోసపోతుంటారు. ఈ క్రమంలోనే తెలంగాణ పోలీస్ ఎక్స్ వేదికగా గురువారం ఆసక్తికర పోస్ట్ చేసింది. సోషల్ మీడియాలో అపరిచితులతో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.

సామాజిక మాధ్యమాల్లో స్నేహాల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించింది. తియ్యటి మాటలకు కరిగిపోవద్దని, వ్యక్తిగత విషయాలు, ఫోటోలు, వీడియోలు అస్సలు ఇవ్వొద్దని తెలిపింది. గోప్యత విషయంలో ఏ మాత్రం ఏమరపాటు వద్దని వెల్లడించింది. సోషల్ మీడియాలో అకౌంట్లకు ప్రొఫైల్ లాక్ తప్పక ఉపయోగించండని హెచ్చరించింది. సామాజిక మాధ్యమాల్లో ఎవరైనా వేధిస్తే తక్షణమే పోలీసులకు ఫిర్యాదు చేయాలని ప్రజలకు సూచించింది.

Advertisement

Next Story