- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Deputy CM Bhatti: దేశ సంపదను అదానీకి కట్టబెడుతుండ్రు.. డిప్యూటీ సీఎం భట్టి సంచలన వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: ప్రభుత్వ రంగ సంస్థలు (Public Sector Organizations), దేశ సంపదను కేంద్రంలోని బీజేపీ (BJP) పెద్దలు అదానీ (Adani)కి అప్పనంగా కట్టబెడుతున్నారని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క (Mallu Bhatti Vikramarka) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అదానీ (Adani)పై రాహుల్ గాంధీ (Rahul Gandhi) వ్యాఖ్యలకు కేంద్రంలోని బీజేపీ (BJP) పెద్దలు సమాధానం చెప్పాలని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వ రంగ సంస్థల (Public Sector Organizations)ను, దేశ సంపదను అప్పనంగా అదానీ (Adani)కి కట్టబెడుతున్నారని ఫైర్ అయ్యారు. తెలంగాణ ప్రభుత్వం (Telagnana Government) నిబంధనల మేరకే పరిశ్రమల ఏర్పాటుకు ఒప్పందం చేసుకుందని తెలిపారు. పారిశ్రామికవేత్తలు ఎవరైనా రాష్ట్రానికి రావొచ్చని అన్నారు. రాష్ట్ర సంపద ప్రజలకే చెందాలన్నది తమ విధానమని అన్నారు. రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఆలోచనలకు తగ్గట్లుగానే తాము నడుచుకుంటామని భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) అన్నారు.
కాగా, బిలియన్ డాలర్ల లంచం (Billion Dollar Bribe), మోసం ఆరోపణలపై అమెరికా (America)లో కేసు నమోదైన అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీపై (Gautam Adani) లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) సంచలన వ్యాఖ్యలు చేశారు. అదానీ (Adani)ని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. అదానీని ఎట్టి పరిస్థితుల్లో అరెస్ట్ చేయబోరని, ఆయనపై విచారణ కూడా జరగదంటూ ఆయన బాంబు పేల్చారు. ప్రధాని నరేంద్ర మోడీతో సహా కేంద్రంలోని పెద్దల సపోర్టుకు ఆయనకు ఉందని కామెంట్ చేశారు.