- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Adani Group: అదానీ గ్రూప్ మోసం కేసులో ఆంధ్రప్రదేశ్ అధికారుల పేరు..!
దిశ, నేషనల్ బ్యూరో: లంచం, మోసం కేసులో అదానీ గ్రూప్(Adani Group) ఛైర్మన్ అదానీపై అమెరికాలో కేసు నమోదైంది. భారీస్థాయి కాంట్రాక్టు పొందేందుకు 265 మిలియన్ డాలర్ల (రూ.2,029 కోట్లు) లంచాలు ఇచ్చేందుకు యత్నించినట్లు అమెరికాలోని బ్రూక్లిన్‌లోని ఫెడరల్ కోర్టు అభియోగాలు మోపడం సంచలనం సృష్టించింది. న్యూయార్క్ ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ అటార్నీ బ్రియాన్ పీస్ ఆదేశాల మేరకు మొత్తం ఐదు అభియోగాలతో గౌతమ్ అదానీ సహా ఏడుగురిపై కేసులు నమోదయ్యాయి. భారత్‌లో భారీ సోలార్ ఎనర్జీ ప్రాజెక్టును దక్కించుకొనేందుకు గౌతమ్ అదానీ, మరో ఏడుగురుతో కలిసి అధికారులకు లంచాలు ఆఫర్ చేసినట్లు అమెరికా ఎఫ్‌బీఐ పేర్కొంది. అలానే బ్యాంకులు, ఇన్వెస్టర్లకు తప్పుడు సమాచారం అందించి నిధులు సమకూర్చేందుకు యత్నించినట్లుగా ఆరోపణలు చేసింది. కాగా.. ఈ ఆరోపణల్లో అమెరికా ఇన్వెస్టర్ల నిధులు కూడా ఉండటంతో ఈ కేసులో యూఎస్ దర్యాప్తు ప్రారంభించింది.
ఏపీకి చెందిన అధికారి..!
సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌తో(SECI) జరిగిన ఒప్పందం స్కాం కేసులో సంచలనాలు బయటకొస్తున్నాయి. భారత్‌లో సోలార్ విద్యుత్ కొనుగోలు ఒప్పందంలో అదానీ గ్రూప్ లంచాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. వేర్వేరు రాష్ట్రాల ప్రభుత్వాధికారులకు రూ.2029 కోట్ల లంచాలు ఇచ్చినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, జమ్ముకశ్మీర్, ఛత్తీస్‌గఢ్, ఒడిశాల్లో ఒప్పందాలకు లంచం ఇచ్చినట్లు అభియోగాలు నమోదయ్యాయి. అయితే, అన్నిరాష్ట్రాల్లో లంచాల ఇచ్చేందుకు రూ.297 కోట్లు ఖర్చు చేస్తే.. ఆంధ్రప్రదేశ్ లో మాత్రం అధిక మొత్తంలో డబ్బు లంచంగా ఇచ్చినట్లు తెలుస్తోంది. జగన్ ప్రభుత్వ హయాంలో కొందరు అధికారులు(Andhra Pradesh government official) 228 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.1750కోట్లు) లంచాలను తీసుకున్నట్లు బ్రూక్లిన్ కోర్టులో చేసిన ఆరోపణల్లో ఉంది. ఈ స్కాం మొత్తం 2019-24 మధ్య చోటు చేసుకున్నట్లు తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌లోని విద్యుత్ పంపిణీ సంస్థలు డిసెంబర్ 1, 2021న అదానీ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు పేర్కొంది. 7,000 మెగావాట్‌ల కొనుగోలు డీల్ కుదరడానికి ‘అవసరమైన ప్రతిపాదనలు’ ముందుకొచ్చినట్లు ఆరోపణల్లో పేర్కొంది. ఈ ఒప్పందం ఒడిశాతో కుదిరిన దానికంటే పెద్దదని వెల్లడించింది.