ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకున్న RSS చీఫ్

by Jakkula Mamatha |
ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకున్న RSS చీఫ్
X

దిశ,వెబ్‌డెస్క్: ఇంద్రకీలాద్రి అమ్మవారిని ఆర్ఎస్ఎస్ చీఫ్(RSS chief) మోహన్ మధుకర్ భగవత్(Mohan Madhukar Bhagwat) దర్శించుకున్నారు. ఈ క్రమంలో నేడు(శనివారం) ఉదయం అమ్మ వారి ఆలయానికి ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌ను రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి(Anam Ramanaraya Reddy), దేవదాయ శాఖ కమిషనర్(Commissioner of Devadaya Department) సత్యనారాయణ(Satyanarayana), ఆలయం ఈవో కేఎస్ రామారావు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారి ఆలయంలో దుర్గమ్మకు మోహన్ భగవత్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి దర్శనానంతరం ఆయనకు పండితులు వేద ఆశీర్వచనం చేశారు. మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, ఆలయ అధికారులు అమ్మవారి చిత్రపటం, లడ్డు ప్రసాదంతో పాటు శేష వస్త్రాన్ని ఆయనకు అందజేశారు. అనంతరం దేవాలయం కార్యాలయంలో మంత్రి ఆనం రామనారాయణరెడ్డి యాప్‌ను ఆవిష్కరించారు.

Advertisement

Next Story

Most Viewed