- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Attack On ED: గోవాలో ఈడీ అధికారులపై క్యాసినో నిర్వాహకుల దాడి
దిశ, నేషనల్ బ్యూరో: గోవాలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) బృందంపై దాడి జరిగింది. గోవాలోని(Goa) క్యాసినో డైరెక్టర్, సిబ్బంది ఈడీ అధికారులపై దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. గురువారం ఈ ఘటన జరిగినట్లు తెలిపారు. క్యాసినో డైరెక్టర్, ఇద్దరు సీనియర్ సిబ్బంది సహా పలువురిపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. ఈడీ అసిస్టెండ్ డైరెక్టర్ పోలూరి చెన్న కేశవరావు, అతడి బృందంపై దాడి జరిగినట్లు పనాజీ పోలీస్ స్టేషన్(Panaji police station) లో కేసు నమోదైనట్లు తెలిపారు. మనీలాండరింగ్ కేసుకు సంబంధించి ఈడీ సేకరించిన సాక్ష్యాలను క్యాసినో డైరెక్టర్ సహా ఇతరులు ధ్వంసం చేశారని ఆరోపించారు. సోదాలు చేస్తున్న అధికారులను గదిలో నిర్బంధించినట్లు తెలిపారు.
గతంలోనూ దాడులు
మరోవైపు, గత నెలలో ఢిల్లీలోని బిజ్వాసన్ ప్రాంతంలోనూ ఈడీ అధికారులపై దాడులు జరిగాయి. సైబర్ మోసం కేసును దర్యాప్తు చేస్తున్నప్పుడు దాడి చేయడంతో అధికారులు గాయపడ్డారు. సైబర్ మోసాలకు చెందిన కేసులో చార్టర్డ్ అకౌంటెంట్ కు చెందిన ఫాంహౌస్ పై దాడి చేయడానికి వెళ్లిన ఈడీ బృందంపై దాడి జరిగింది. ఇక, ఈ ఏడాది జనవరిలో పశ్చిమ బెంగాల్‌లోని ఉత్తర 24 పరగణాస్ జిల్లా సందేశ్‌ఖాలీలోనూ ఈడీ అధికారులపై దాడి జరిగింది. సందేశ్ ఖాలీ నిందితుడు షేక్ షాజహాన్ కు సంబంధించిన ఆకేసులో దర్యాప్తునకు వెళ్లిన.. ముగ్గురు అధికారులు గాయపడ్డారు.