- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Eatala: ఆ సామెతకు నిలువెత్తు నిదర్శనం రేవంత్ రెడ్డి.. బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్
దిశ, వెబ్ డెస్క్: ఓడ మల్లన్న సామెతకు నిలువెత్తు నిదర్శనం రేవంత్ రెడ్డి అని మల్కాజ్ గిరి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. "అధికారంలోకి రాగానే తెలంగాణ సమగ్ర శిక్షా కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తాం" అని ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి పెట్టిన ట్వీట్‌ను ప్రస్తావిస్తూ.. సీఎం పై విమర్శలు చేశారు. ఈ సందర్భంగా ఈటల.. రేవంత్ రెడ్డి..ఇది మీ ట్వీట్ నే గుర్తుందా..? అని ఎద్దేవా చేశారు. అలాగే ఒడ్డు ఎక్కేదాక ఓడ మల్లన్న.. ఎక్కాక బోడ మల్లన్న అనే సామెతకు నిలువెత్తు నిదర్శనం మీరు అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
అంతేగాక ఇచ్చిన మాట నిలబెట్టుకోలేని మీలాంటి వాళ్లకు సరైన గుణపాఠం తప్పుదని హెచ్చరించారు. ఇకనైనా కళ్లుతెరుచుకుని సమగ్ర శిక్ష ఉద్యోగులకు మీరిచ్చిన హామీలు నెరవేర్చాలని బీజేపీ ఎంపీ డిమాండ్ చేశారు. కాగా ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి ట్విట్టర్ లో "విద్యాశాఖలో పని చేస్తోన్న ఎస్ఎస్ఏ (తెలంగాణ సమగ్ర శిక్షా కాంట్రాక్ట్ ఉద్యోగులు) ఉద్యోగులు వారి న్యాయమైన హక్కుల కోసం నెల రోజుల పాటు ఆందోళన చేసిన విషయం నా దృష్టిలో ఉందని.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే వాళ్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా" అని రాసుకొచ్చారు.