- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గ్రూపుల గోల.. నిరసనల సెగ.. నలిగిపోతున్న నారాయణస్వామి!
దిశ, తిరుపతి: నారాయణస్వామి మూడు సార్లు ఎమ్మెల్యేగా పని చేసినా ఎలాంటి ఇబ్బందులు పడలేదు. డిప్యూటీ సీఎం అయ్యాక రాష్ట్రంలో ఏ మంత్రి అనుభవించని ఇబ్బందులు అనుభవిస్తున్నారనే పుకార్లు వినిపిస్తున్నాయి. సమస్యలు కంట్రోల్ అవ్వకపోగా, రోజూరోజుకు పెరుగుతుండటం పెద్ద సమస్యగా మారింది. ఇప్పటి వరకు కింది స్ధాయిలో ఉన్న విభేధాలు, నేరుగా ఆయన వరకు వచ్చినట్లు చర్చ జరుగుతోంది. ప్రభుత్వ ఎన్ఆర్ఐ సలహాదారు మహాసముద్రం జ్ఞానేంద్రరెడ్డికి, డిప్యూటీ సీఎం నారాయణ స్వామి మధ్య సర్పంచ్ ఎన్నికల్లో నేపథ్యంలో అంతర్గత విభేదాలు ఏర్పడ్డాయి. ఆ పార్టీ మండల కమిటీ అధ్యక్షుల నియామకం విషయంలో బట్టబయలై, ప్రస్తుతం తారాస్థాయికి చేరుకున్నాయని తెలుస్తుంది. ఏకంగా సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీలు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి మరీ నారాయణస్వామిని తిట్టే దశకు చేరుకున్నాయి.
వెంటాడుతున్న నిరసనలు
డిప్యూటీ సిఎం మీద ఉండే వ్యతిరేకత కాస్తా వైసీపీ నేతలు ఇప్పుడు అధినేతపై కోపం పెరిగేలా చేస్తున్నాయని వాదనలు వినిపిస్తున్నాయి. ఇటీవల జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి ఓటమికి, డిప్యూటీ సీఎం నారాయణస్వామి ఏకపక్ష నిర్ణయాలేనని వ్యతిరేక వర్గం ఆరోపిస్తోంది. నారాయణ స్వామి, ఆయన వర్గం పోలీసులు, అధికారులను అడ్డం పెట్టుకుని సొంత పార్టీ నేతలపైనే కేసులు పెట్టిస్తున్నారంటూ ఫైరవుతున్నారు. ఈ గ్రూపులు ఒకవైపు వేడి ఎక్కిస్తుంటే, మరోవైపు గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో నారాయణ స్వామికి నిరసనల సెగ ఎక్కువైంది. ఎక్కడికి వెళ్లినా అదే సీన్ రిపీట్ అవుతోందట. సమస్యలు పరిష్కరించ లేదని స్థానిక ప్రజలు ఆయనను నిలదీస్తున్నారు.
సమస్యలపై నిలదీత
పెనుమూరు మండలంలోనూ స్థానికులు పలుమార్లు డిప్యూటీ సీఎంను నిలదీశారు. ‘‘ఎన్ని కల సమయంలో మాత్రమే కనిపిస్తావ్.. ఏళ్ల తర్వాత ఇప్పుడు వచ్చావు.. మాకు చేసేది ఏం లేదు. ఎందుకు వచ్చావు’’ అంటూ మోహన్రెడ్డి అనే అడ్వకేట్ ప్రశ్నించారు. తర్వాత కలికిరిలోనూ ఇలాంటి అనుభవమే ఎదురైంది. ‘‘మీ అనుచరులు నాడు- నేడు పనుల్లో అవినీతి చేసి, బిల్లులు అధికంగా పెట్టాలని హెచ్ఎంను ఇబ్బంది పెడుతుంటే ఎందుకు సపోర్టు చేస్తున్నారు’’ అంటూ గ్రామస్థులు నిలదీశారట. తాజాగా కార్వేటినగరం బీసీ కాలనీలో ఓ నిరుద్యోగి జాబ్ క్యాలెండర్, డీఎస్సీ నిర్వహణ గురించి గట్టిగా ప్రశ్నించారు. ఇలా డిప్యూటీ సీఎం నారాయణ స్వామి ఎక్కడికెళ్లినా నిరసన సెగ తగులుతూనే ఉంది.
నారాయణస్వామి ‘కష్టం’పై విచారం!
ఒకవైపు గ్రూపులు, మరోవైపు గడపగడపకు కార్యక్రమంలో నిరసనల సెగతో మంత్రి తెగ ఇబ్బందులు పడుతున్నారని నియోజకవర్గంలో చర్చించుకుంటున్నారు. జిల్లాలో ఇతర వైసీపీ నేతలు సైతం నారాయణ స్వామికి ఇంత కష్టం ఎదురవుతుందని తెలుసుకొని విచారం వ్యక్తం చేస్తున్నారట. ఒకరిని కంట్రోల్ చేయలేక.. మరొకరికి సమాధానం చెప్పలేక నారాయణ స్వామి నలిగిపోతున్నారనే మాటలు జిల్లా వైసీపీలో హాట్ హాట్ టాపిక్గా మారింది.
Also Read..
- Tags
- Andrapradesh