- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బీఎస్పీలో చేరిన మరో రిటైర్డ్ ఐపీఎస్ అధికారి
దిశ, డైనమిక్ బ్యూరో: విశ్రాంత ఐపీఎస్ అధికారి జె. పూర్ణ చంద్రరావు బహుజన సమాజ్ పార్టీ(బీఎస్పీ)లో చేరారు. గురువారం విజయవాడలో బీఎస్పీ సెంట్రల్ కో ఆర్డినేటర్ రాంజీ గౌతమ్, తెలంగాణ బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఏపీ చీఫ్ పరంజ్యోతి సమక్షంలో బహుజన సమాజ్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పూర్ణ చంద్రరావు మాట్లాడుతూ.. ‘ఈ రోజు నేను మళ్లీ పుట్టాను.. నన్ను నేను తెలుసుకోవడానికి 62 ఏళ్లు పట్టిందా అనిపించింది’ అని అన్నారు. ఏపీ రాష్ట్రానికి కుల పిచ్చిపట్టిందని, అన్ని రంగాల్లో కులమే రాజ్యమేలుతోందని మండిపడ్డారు. కాన్షీరాం సిద్ధాంతం తనను ఆకర్షించిందని చెప్పారు.
కాగా, పూర్ణ చంద్రరావు నిజామాబాద్, నెల్లూరు, శ్రీకాకుళం, గుంటూరు జిల్లాల ఎస్పీగా, విశాఖపట్నం పోలీసు కమిషనర్‌గా పనిచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డీఐజీ, ఐజీ, ఆర్టీసీ ఎండీ, తెలంగాణలో పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు ఛైర్మన్, ఏసీబీ డైరెక్టర్ జనరల్‌గా పనిచేశారు. రెండేళ్ల క్రితం ఆయన పదవీ విరమణ పొందారు. ఆంధ్రప్రదేశ్‌లో పనిచేయాలని ఆయనకు బీఎస్పీ నుంచి ఆహ్వానం అందగా.. అందుకు అంగీకరించి ఆయన పార్టీలో చేరారు.