స్పందించండి సారూ.. వైసీపీ నేతల ఆగడాలపై రైతుల ఆవేదన!

by Anjali |
స్పందించండి సారూ.. వైసీపీ నేతల ఆగడాలపై రైతుల ఆవేదన!
X

దిశ, నెల్లూరు: అయ్యా .. ఉన్న కాస్త జాగాను ఆక్రమించుకున్నారయ్యా. మాకు రక్షణ కల్పించడయ్యా.. అంటూ స్పందనలో ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. భూ ఆక్రమణలకు సంబంధించిన సమస్యలపై బాధితులు ఎక్కువగా మొర పెట్టుకున్నారు. అధికారం ఉందన్న అండతో రాజకీయ నేతలు తమ భూములను ఆక్రమించుకుంటున్నారని బాధితుతమ గోడును వెళ్ల బోసుకుంటున్నారు. వీటిని పరిష్కరించేందుకు అధికారులకు సైతం తలనొప్పిగా మారింది. నేరస్తుడు ప్రముఖ రాజకీయ పార్టీలకు చెందిన వారు కావడంతో అధికారులు కూడా సైలెంట్‌గా ఉండిపోతున్నారు.

యథేచ్చగా ఆక్రమణలు

నెల్లూరు జిల్లా కేంద్రంగా ఉన్న చట్టుపక్కల ఉన్న పంచాయతీల్లో ఇళ్ల స్థలాలు, వ్యవసాయ భూముల విలువ బాగా పెరిగింది. ఏడాది క్రితం సెంటు స్థలం రూ.లక్ష ఉంటే.. ఇప్పుడు అదే స్థలం రూ.2 లక్షలు పలుకుతుంది. వ్యవసాయ భూముల ధరలు కూడా ఇంచుమించు ఇంతే స్థాయిలో పెరిగాయి. నెల్లూరుకు సమీపంలో నివసిస్తున్న రమేష్‌కు చెందిన సర్వే నంబరు 252లో ఉన్న సాగు భూమిని వైసీపీ నేతలు ఇప్పటికే కబ్జా చేశారు. నెల్లూరుకు అతి సమీపంలో ఉండడంతో ఇక్కడ గజం స్థలం రూ. 2 లక్షలకుపైగా పలుకుతోంది. దీంతో అధికారులను ఏమార్చి అక్రమార్కులు డూప్లికేట్ అడంగల్ సృష్టించి భూమి తమదంటూ ఎక్స్‌వేటర్లతో భూములను చదును చేస్తి రాళ్లు పాతి అమ్ముకుంటున్నారు.

అధికారం అండతో..

జిల్లాలో వైసీపీ నేతల అగడాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఇందుకు స్పందన కార్యక్రమంలో వైసీపీ నేతలపై వస్తున్న ఫిర్యాదులు నిదర్శమని చెప్పొచ్చు. రాజకీయ పలుకుబడితో భూములను ఆక్రమించి ఎక్స్‌వేటర్లతో చదును చేయించి దర్జాగా కబ్జా చేస్తున్నారు. అనంతరం ప్లాట్‌లుగా విభజించి అమ్ముకుంటున్నారు.

సాగు భూమిని ప్లాట్లుగా మార్చి విక్రయాలు

తన భూమిని ట్రాక్టర్లతో చదును చేసి వ్యవసాయ భూమిని ప్లాట్లుగా మార్చి అమ్ముకోవాలని చూస్తున్నారని, తన భూమిని ఇప్పించాలని అధికారుల చుట్టూ తిరిగినా న్యాయం జరగడం లేదని నెల్లూరు రూరల్ నవనాకుల తోట గ్రామానికి చెందిని రమేష్ ఆవేదన వ్యక్తం చేశారు. 1971తో రెండు ఎకరాల భూమిని కొన్నామని, అప్పటి నుంచి అది తమ అధీనంలోనే ఉందని తెలిపారు. అయితే ఇప్పుడు కొందరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి అనుచరులు వచ్చి భూమి తమదంటూ అక్కడున్న అరటి చెట్లు, కొబ్బరి చెట్లను కొట్టి చదును చేసుకుని ప్లాట్లుగా మార్చి విక్రయించేందుకు సిద్ధపడుతున్నారని రమేష్ వాపోయారు.

Advertisement

Next Story