- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Amaravati: రైతులతో సీఆర్డీఏ భేటీ.. అమరావతి నిర్మాణంపై కీలక ప్రకటన
దిశ, వెబ్ డెస్క్: అమరావతి రైతులతో రైతులతో సీఆర్డీఏ, ప్రపంచ బ్యాంకు, ఏడీబీ ప్రతినిధులు భేటీ అయ్యారు. రాజధాని అభివృద్ధిపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఆర్డీఏ కమిషనర్ భాస్కర్ మాట్లాడుతూ రాజధానిలో చేపట్టే ప్రాజెక్టులపై రైతుల సందేహాలు సగం నివృత్తి చేశామన్నారు. రుణాలు ఇచ్చే సమయంలో ఇళ్లు కట్టాలనే షరతు రైతులు పెట్టారని తెలిపారు. అమరావతికి బయటి నుంచి వచ్చే వారికి ఇళ్లు మంజూరు చేస్తామన్నారు. 10 మిలియన్ డాలర్ల పెట్టుబడి వస్తే ఒక మిలియన్ వరకూ రాయితీ ఇస్తామని చెప్పారు. ఒప్పందంలో భాగంగా అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. రైతులు లేవనెత్తిన 80 అంశాలన్నీ ఒప్పందంలో ఉన్నాయని గుర్తు చేశారు. కోర్టు కేసులపై ప్రభుత్వం దృష్టి పెట్టిందని, త్వరలో నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు. ఒప్పందాలన్నీ పూర్తి అయితే రుణాలు మంజూరుకు మార్గం సులభతరం అవుతుందన్నారు. సుమారు రూ. 30 వేల కోట్ల రుణం వచ్చే ఛాన్స్ ఉందన్నారు. రుణాల మంజూరుపై ఈ నెల 11న ఢిల్లీలో సంతకాలు జరుగుతాయని చెప్పారు. రుణాలు విడుదల అయిన వెంటనే అమరావతి నిర్మాణం మొదలు పెడతామని సీఆర్డీఏ కమిషనర్ భాస్కర్ పేర్కొన్నారు.