- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏపీ హైకోర్టులో మార్గదర్శికి ఊరట
దిశ, డైనమిక్ బ్యూరో : ఏపీ హైకోర్టులో మార్గదర్శి యాజమాన్యానికి ఊరట లభించింది. మార్గదర్శి చిట్‌ఫండ్‌పై సీఐడీ వేసిన పిటిషన్‌ను హైకోర్టు సస్పెండ్ చేసింది. చీరాల, విశాఖ, సీతంపేట బ్రాంచ్‌ల బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేయాలని సీఐడీ నిర్ణయించింది. ఈ మేరకు బ్యాంకు ఖాతాల ఫ్రీజ్ చేసేందుకు అనుమతి ఇవ్వాలని సీఐడీ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది. బ్యాంకు ఖాతాలు ఫ్రీజ్ చేయాలన్న సీఐడీ పిటిషన్‌ను హైకోర్టు సస్పెండ్ చేస్తూ తీర్పు వెల్లడించింది. అయితే ఈకేసులో సీఐడీ విచారణ జరుపుకోవచ్చని కానీ బ్యాంకు ఖాతాలు ఫ్రీజ్ చేయడడం కుదరదని హైకోర్టు స్పష్టం చేసింది. ఇకపోతే మార్గదర్శి చైర్మన్ రామోజీరావు, ఎండీ శైలజాకిరణ్‌కు బుధవారం హైకోర్టులో భారీ ఊరట లభించింది. మార్గదర్శి చిట్ ఫండ్‌లో అక్రమాలు జరిగాయంటూ రామోజీరావు, శైలజాకిరణ్‌పై సీఐడీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో స్టే ఇవ్వాలంటూ రామోజీరావు తరపున న్యాయవాదులు హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన ధర్మాసనం సీఐడీపై ప్రశ్నల వర్షం కురిపించింది. చిట్ ఫండ్‌కు సంబంధించి తమ పరిధిలో లేకపోయినా కేసు ఎందుకు నమోదు చేశారని ప్రశ్నించింది. ఈ కేసుకు, చిట్ ఫండ్‌కు సంబంధమేంటని అడిగింది. చిట్ ఫండ్ కేసు అయితే అది చిట్ ఫండ్ చట్టం కిందకు వస్తుంది కదా అని సీఐడీని హైకోర్టు ప్రశ్నించింది. ఈ కేసులో సీఐడీ తదుపరి చర్యలపై స్టే విధించింది. అంతేకాదు 8 వారాలు పాటు ఈ కేసుులో ఎలాంటి చర్యలు తీసుకోవద్దని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు ఈ కేసులో కౌంటర్ దాఖలు చేయాలని సీఐడీని ఆదేశిస్తూ తదుపరి విచారణను డిసెంబర్ 6కు వాయిదా వేసింది.