BREAKING: ఏపీలో మరోసారి నిలిచిపోయిన రిజిస్ట్రేషన్ సేవలు

by Satheesh |   ( Updated:2024-02-05 10:47:56.0  )
BREAKING: ఏపీలో మరోసారి నిలిచిపోయిన రిజిస్ట్రేషన్ సేవలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి రిజిస్ట్రేషన్ సేవలు నిలిచిపోయాయి. సర్వర్లు మొరాయించడంతో రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ ఉదయం నుండి మరోసారి రిజిస్ట్రేషన్లు ఆగిపోయాయి. దశమి మంచి రోజు కావడంతో సోమవారం ఉదయం నుండి భూములు, భవనాల రిజిస్ట్రేషన్ల కోసం కార్యాలయాలకు జనం పొటెత్తారు. ఈ క్రమంలో ఒత్తిడి పెరిగి సర్వర్లు మొరాయించాయి. దీంతో ఉదయం నుండి రాష్ట్రవ్యాప్తంగా రిజిస్ట్రేషన్ సేవలు నిలిచిపోయాయి. తీవ్ర ఆగ్రహానికి గురైన కొందరు వ్యక్తులు పలుచోట్ల రిజిస్ట్రార్లతో వాగ్వాదానికి దిగారు. వెంటనే సాంకేతిక సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా, గత వారం రోజుల కిందట కూడా సర్వర్లు మొరాయించడంతో ఏపీలో రిజిస్ట్రేషన్ సేవలు నిలిచిపోయిన విషయం తెలిసిందే. ఇవాళ మరోసారి రిజిస్ట్రేషన్లకు అవాంతరాలు తలెత్తడంతో ప్రజలు అధికారులపై తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Next Story