Viral News: పొంత పొసగనప్పుడు మార్చుడే..5 ఏళ్ళలో 5 పార్టీలు మారిన నేత..

by Indraja |
Viral News: పొంత పొసగనప్పుడు మార్చుడే..5 ఏళ్ళలో 5 పార్టీలు మారిన నేత..
X

దిశ డైనమిక్ బ్యూరో: రాజకీయాల్లో మార్పులు చేర్పులు సహజం. ఈ రోజు ఓ పార్టీని తిట్టిన వారే రేపు అదే పార్టీలో చేరి తియ్యని వేడుక చేసుకుందాం అంటూ కలిసి విందులు వినోదాలకు వెళ్తుంటారు. ఇలా రాజకీయ నేతలు పార్టీలు మారడం, ఒకరి నొకరు దుర్భాషలాడుకోవడం ప్రస్తుతం సహజంగా మారిపోయింది. అయితే ఒక పార్టీనో లేక రెండు పార్టీలో మారిన నేతలను చూసే ఉంటారు. కానీ ఓ నాయకుడు మాత్రం ఏకంగా 5 పార్టీలను మారారు. అది కూడా రాజకీయ అరంగేట్రం చేసిన 5 ఏళ్లలోనే మారడం గమనార్హం.

వివరాల్లోకి వెళ్తే.. మాజీ మంత్రి రావెల కిషోర్‌బాబు ఈయన ప్రజలకు సేవ చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చారో లేక పొలిటికల్ పార్టీల పై PHD చేసి పుస్తకాన్ని రాసి ప్రచురిద్దాం అనుకోని వచ్చారో తెలీదు గాని.. రాజకీయాల్లోకి వచ్చిన 5 సంవత్సరాల్లో 5 పార్టీలు మారి రికార్డు సృష్టించారు.IRS అధికారిగా ఉన్న ఆయన ఆ ఉద్యోగానికి రాజీనామా చేశారు. అనంతరం 2014 లో తెలుగుదేశం పార్టీలో చేరడంతో ఈయన రాజకీయ ప్రస్థానం మొదలైంది.

ఈ నేపథ్యంలో టీడీపీ తరుపున పత్తిపాడు నియోజకవర్గం నుండి పోటీ చేసి విజయ పతాకాన్ని ఎగరవేసిన ఈయన టీడీపీ లో మంత్రిగా పని చేశారు. అయితే మంత్రిగా పదవిని చేపట్టిన రెండున్నర సంవత్సరాలకి పదవిని కోల్పోయారు. దీనితో 2018 లో టీడీపీకి రాజీనామా చేసి అదే ఏడాది డిసెంబర్ లో జనసేన పార్టీలో చేరారు.ఇక జనసేన తరుపున పత్తిపాడు నుండి పోటీ చేసి ఓటమిని చవి చూసారు. ఈ నేపథ్యంలో 2019 జూన్ లో జనసేనకు స్వస్తి పలికి 2019 లో బీజేపీ లో చేరారు.

ఇక అందులో కూడా ఇమడలేని రావెల బీజేపీ బైబై చెప్పి కేసీఆర్ సమక్షంలో 2023 లో బిఆర్ఎస్ గూటికి చేరారు. అయితే బిఆర్ఎస్ ఊహించని రీతిలో ఓటమి పాలవడంతో ఆ పార్టీకి గుడ్ బై చెప్పి 2024 రానున్న ఎన్నికల నేపథ్యంలో నిన్న జగన్ సమక్షంలో వైసీపీ తీర్ధం పుచ్చుకున్నారు. మరి ఈ పార్టీలో అయిన కొనసాగుతారో లేక మరో పార్టీకి మకాం మారుస్తారో వేచి చూడాలి. ఏదేమైనా ఆకలితో ఉన్న పులికి ఆహారం దొరికినట్లు ఎప్పుడు ఎవరు దొరుకుతారా అని ఎదురుచూసే ట్రోల్లర్స్ కి 5 పార్టీలు మారిన ఈ నాయకుడు మండుటెండలో చల్లని కూల్ డ్రిక్ లా దొరికారు. దీనితో ట్రోల్లర్స్ రావెలని ఒక రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed