Seethakka: అదే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం.. మంత్రి సీతక్క కీలక ప్రకటన

by Gantepaka Srikanth |
Seethakka: అదే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం.. మంత్రి సీతక్క కీలక ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: ఉచిత బస్సు పథకం(Free Bus Scheme) తెలంగాణ మహిళలకు ఎంతో ఉపయోగపడుతోందని మంత్రి సీతక్క(Minister Seethakka) స్పష్టం చేశారు. మంగళవారం హన్మకొండ(Hanamkonda)లో నిర్వహించిన ప్రజాపాలన విజయోత్సవ సభలో ఆమె పాల్గొని ప్రసంగించారు. ఉచిత బస్సు ప్రయాణంపై విపక్షాలు అసత్య ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. ఆర్టీసీలో అద్దె బస్సులను కూడా మహిళల కోసమే ఉపయోగిస్తున్నట్లు తెలిపారు. మహిళలపై భారం పడకూడదని తమ ప్రభుత్వం భావిస్తోందని అన్నారు. గ్యాస్ సిలిండర్‌పై రాయితీ ఇచ్చి ఆర్థిక భారం తగ్గించామని తెలిపారు. నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇచ్చామని వెల్లడించారు.

రాష్ట్రంలో 60 లక్షల మంది మహిళలను వ్యాపారులుగా మార్చాలనేదే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని సీతక్క ప్రకటించారు. దేశంలో ఇప్పటివరకు ఏ ప్రభుత్వం కూడా ఇవ్వని విధంగా అధికారంలోకి వచ్చిన 11 నెలల్లోనే 50 మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చామని తెలిపారు. రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేశామని అన్నారు. తెలంగాణను బీఆర్ఎస్ నేతలు అప్పుల కుప్పగా మార్చి తమకు ఇస్తే.. అప్పులు కడుతూనే అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. అధికారం కోల్పోయేసరికి దిక్కుతోచని స్థితిలో ఉన్న బీఆర్ఎస్ నేతలు.. ప్రభుత్వంపై కుట్రలకు దిగారని మండిపడ్డారు. లగచర్లలో రైతులను రెచ్చగొట్టి ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Next Story

Most Viewed