పులి సంచారం పై గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : డీఎఫ్‌వో నీరజ్ కుమార్

by Aamani |
పులి సంచారం పై గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : డీఎఫ్‌వో నీరజ్ కుమార్
X

దిశ, ఆసిఫాబాద్ : పులి సంచారం పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డీఎఫ్ వో నీరజ్ కుమార్ సూచించారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు పులి ప్రస్తుతం జోడేఘాట్, కెరమెరి అడవి ప్రాంతాల్లో సంచారిస్తోందని, ఈ పరిసర ప్రాంతాల్లో 15 వరకు గిరిజన గ్రామాలు ఉన్నాయని, వారి అప్రమత్తం చేయడం తో పాటు అటవీ శాఖ ఆధ్వర్యంలో పులి పట్ల అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు.

అలాగే పులి అడుగు జాడలతో పులి వెళ్లే ప్రాంతాన్ని ఉట్నూర్ అటవీ శాఖ అధికారులతో కలిసి ట్రాకింగ్ చేస్తున్నామని చెప్పారు. రైతులు ఎవరు అధైర్య పడొద్దని.. పులి దాడిలో ఇప్పటికే రెండు ఆవులు మృతి చెందగా బాధిత రైతులకు నష్టపరిహారం ఇచ్చామని, పులి దాడిలో పశువుల మరణిస్తే వెంటనే స్థానిక అటవీ శాఖ అధికారులు సమాచారం ఇస్తే పరిహారం చెల్లిస్తామని పేర్కొన్నారు. వ్యవసాయ పనులకు వెళ్లే రైతులు, కూలీలు ఒంటరిగా వెళ్లొద్దని,సాయంత్రం తొందరగా పనులు ముగించుకుని ఇంటికి వెళ్లాలని కోరారు.

Advertisement

Next Story