ఏపీలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన

by Jakkula Mamatha |   ( Updated:2024-10-14 14:27:31.0  )
ఏపీలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీ సచివాలయంలో ఇండస్ట్రీయల్ డెవలప్‌మెంట్, MSME, ఫుడ్ ప్రాసెసింగ్ డ్రాఫ్ట్ పాలసీలపై అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ క్రమంలో నూతన పాలసీతో రాష్ట్రంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు తెచ్చేందుకు సీఎం చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ‘ఒక కుటుంబం.. ఒక పారిశ్రామిక వేత్త’ అనే కాన్సెప్ట్‌తో ఎంఎస్‌ఎంఈ పాలసీ ఉండాలని సీఎం చంద్రబాబు తెలిపారు. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ పేరుతో పారిశ్రామిక రంగ అభివృద్ధికి ప్రత్యేక హబ్ తీసుకురావాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో అమరావతిలో రతన్ టాటా పేరుతో ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటు చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. స్కిల్ డెవలప్‌మెంట్, ఇన్నోవేషన్, స్టార్టప్స్, ఫెసిలిటేషన్ కేంద్రంగా దీనిని మారుస్తామన్నారు. ‘MSME’, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మహిళా వ్యాపారవేత్తలకు 5 శాతం ఇన్సెంటివ్స్ ఇస్తాం అని తెలిపారు. ఎక్కువ ఉద్యోగాలు కల్పించే కంపెనీలకు అదనంగా పది శాతం ప్రోత్సాహకం అందిస్తాం అని పరిశ్రమల పై సమీక్షలో సీఎం వెల్లడించారు.

Advertisement

Next Story