- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Breaking News : ఆ విషయంలో దొరికిపోయిన విడదల రజని..వామ్మో ఇంత స్కాం జరిగిందా?
దిశ డైనమిక్ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు హీటెక్కుతున్నాయి. రానున్న ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా ప్రతి పార్టీ అడుగులేస్తోంది. ఈ నేపథ్యంలో అధికార పార్టీ రానున్న ఎన్నికల్లో అధికారం చేజారకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇందుకు అవినీతికి పాల్పడుతుందని ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి ఆరోపించారు. తాజాగా మీడియాతో మాట్లాడిన ఆమె దొంగ ఓట్ల పై సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుపతిలో ఉప ఎన్నికల నేపథ్యంలో 35 వేల దొంగ ఓట్లను గుర్తించామని పేర్కొన్నారు.
అలానే దొంగ ఓట్ల గురించి ఆధారాలతో కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామని పేర్కొన్నారు. ఇక ఇప్పటికే ఫిర్యాదుల పై ద్రుష్టి సారించిన సీఈసీ చర్యలు తీసుకుంటోంది పేర్కొన్నారు. ఇక దొంగ ఓట్ల అంశం పై ఐపీఎస్ లపై కూడా చర్యలు తీసుకుంటున్నారని వెల్లడించారు. వైసీపీ రానున్న ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థులను బదిలీ చేయడంతో పాటుగా ఓటర్లను లోపాయికారిగా నియోజకవర్గం మారుస్తున్నారని మండిపడ్డారు.
ఇక విడదల రజని చిలకలూరు పేట నుండి గుంటూరుకి మార్చారని.. ఈ నేపథ్యంలో ఆమెకు అనుకూలంగా ఉన్న పది వేల మంది ఓటర్లను లోపాయికారిగా నియోజకవర్గం మారుస్తున్నారని ఆరోపించారు. ఇక ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ఎక్కువ శాతం బీజేపీ చేసింది అని తెలిపారు. ఇక రానున్న లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ 350 కంటే ఎక్కువ సీట్లను కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.ఇక పొత్తుల అంశానికి వస్తే అధిష్టానం నిర్ణయం తీసుకుంటోందని పేర్కొన్నారు.