Rajampet: వైసీపీ ఎమ్మెల్యేకు మరో బిగ్ షాక్

by srinivas |   ( Updated:2025-03-02 15:55:29.0  )
Rajampet: వైసీపీ ఎమ్మెల్యేకు మరో బిగ్ షాక్
X

దిశ, వెబ్ డెస్క్: రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి(Rajampet MLA Akepati Amarnath Reddy)కి మరో బిగ్ షాక్ తగిలింది. బినామీ పేర్లతో ఉన్న భూముల డాక్యుమెంట్లను రెవెన్యూ అధికారులు రద్దు చేశారు. అంతేకాదు ఆయన కుటుంబ సభ్యుల బినామీ పేర్లతో ఉన్న 29.3 ఎకరాల భూములను సైతం స్థానిక తహశీల్దార్ ఆదేశాలతో సబ్ రిజిస్ట్రర్ రద్దు చేశారు. కాగా ఆకేపాటి జోతి, అమర్నాథ్ రెడ్డి పేరుతో 2023లో 4 ఎకరాల భూమిని, అలాగే ఆకేపాటి సుజన, తన భర్త అనిల్ కుమార్ పేరుపై 5 ఎకరాల భూమి రిజిస్ట్రర్ అయింది. ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి.. తన తమ్ముడు అనిల్ కుమార్ రెడ్డి పేరుతో మరో ఐదు ఎకరాలు రిజిస్ట్రర్ చేశారు. వారితో పాటు మరికొందరి పేరుతోనూ భూములు రిజిస్ట్రర్ అయ్యాయి. వీటన్నింటినీ గుర్తించిన తహశీల్దార్ వెంటనే రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. అయితే ఈ చర్యలను ఆకేపటి ఫ్యామిలీ ఖండించింది. ఆ భూములన్నీ సక్రమంగా కొనుగోలు చేసినట్లు తెలిపింది. ప్రభుత్వ తప్పులను ప్రశ్నించడం వల్లే ఎమ్మెల్యే ఆకేపాటిని టార్గెట్ చేశారని ఆరోపించారు. అయితే కోర్టు పరంగా న్యాయ పోరాటం చేస్తామని తెలిపారు.

Next Story

Most Viewed