- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తోంది: మాజీమంత్రి పీతల సజాత
దిశ, డైనమిక్ బ్యూరో : రాష్ట్రంలో దళిత మహిళలపై అఘాయిత్యాలకు అడ్డుఅదుపులేకుండా పోయిందని మాజీమంత్రి పీతల సుజాత అన్నారు. రక్షణ కల్పించాల్సిన అధికార పార్టీ నేతలే దళిత స్త్రీలను హత్య చేయడం దుర్మార్గం అన్నారు. ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం రావివారిపాలెంలో దళిత స్త్రీ హనుమాయమ్మను వైసీపీ నాయకుడు ట్రాక్టర్‌తో తొక్కించి చంపడం దారుణం అని అన్నారు. గతంలో గుంటూరు జిల్లా నకిరేకల్లు మండలం శివాపురం తండాకు చెందిన మంత్రూబాయి అనే గిరిజన మహిళను శ్రీనివాసరెడ్డి ట్రాక్టర్ తో తొక్కించి అతిదారుణంగా హత్య చేశాడని గుర్తు చేశారు. ఇప్పుడు అదే తరహాలో హత్యగావించడం వైసీపీ గూండాల సైకోయిజానికి నిదర్శనం అని మండిపడ్డారు.
ఇది ముమ్మాటికి ప్రభుత్వ హత్యే అని మాజీమంత్రి పీతల సుజాత అన్నారు. వైసీపీ నాయకులకు దళిత మహిళలంటే ఎటువంటి భావన ఉందో ఈ సంఘటనతో బహిర్గతమైంది అని చెప్పుకొచ్చారు. వైఎస్ జగన్‌కు దళితులు అంటే చిన్నచూపు అని... అందుకే వైసీపీ చిల్లర గ్యాంగ్ దళిత స్త్రీలపై పేట్రేగిపోతోంది అని ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను టార్గెట్ చేసి హత్యలు చేయడం రాజారెడ్డి రాజ్యాంగానికి నిదర్శనం అని మండిపడ్డారు. దళిత అంగన్ వాడీ టీచర్ హనుమాయమ్మ హత్య ఘటనలో హంతకుడైన కొండలరావుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి అని కోరారు. బాధితుడైన సుధాకర్ కుటుంబానికి న్యాయం చేయాలి అని మాజీమంత్రి పీతల సుజాత డిమాండ్ చేశారు.