వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై సీజేఐకు పురందేశ్వరి ఫిర్యాదు

by Javid Pasha |   ( Updated:2023-11-04 06:41:49.0  )
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై సీజేఐకు పురందేశ్వరి ఫిర్యాదు
X

దిశ, వెబ్‌డెస్క్: గత కొంతకాలంగా ఏపీ రాజకీయాల్లో పురందేశ్వరి వర్సెస్ విజయసాయిరెడ్డి వార్ నడుస్తోంది. వైసీపీ ప్రభుత్వంపై పురందేశ్వరి విమర్శనస్త్రాలు ఎక్కుపెడుతున్నారు. మద్యంలో అవినీతి జరిగిందనే విషయాన్ని ఫోకస్ చేయడంతో పాటు ప్రభుత్వ వైఫల్యాలపై ప్రశ్నిస్తూ వస్తోన్నారు. దీంతో పురందేశ్వరిని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి టార్గెట్ చేస్తూ వస్తోన్నారు. చంద్రబాబుకు లబ్ధి చేకూర్చేలా పురందేశ్వరి రాజకీయాలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. దీంతో ఏపీ పాలిటిక్స్‌లో ఇద్దరి మధ్య మాటల యుద్దం నడుస్తోంది.

ఈ క్రమంలో విజయసాయిరెడ్డిపై ఫిర్యాదు చేస్తూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి పురందేశ్వరి లేఖ రాశారు. అధికార దుర్వినియోగానికి ఆయన పాల్పడుతున్నారని, అవినీతి కేసుల్లో 10 ఏళ్లుగా బెయిల్‌పై కొనసాగుతూ షరతులు ఉల్లంఘిస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. లేఖతో పాటు ఐదు పత్రాలను సీజేఐకు పురందేశ్వరి పంపించారు.

Read More: మీది కుటుంబ రాజకీయమా.. కుటిల రాజకీయమా..? పురందేశ్వరిపై విజయసాయి రెడ్డి ఫైర్

Advertisement

Next Story