- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Anantapur: బాలికకు చిత్రహింసలు.. ఇద్దరు అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లకు రిమాండ్
దిశ, వెబ్ డెస్క్: అనంతపురం జిల్లా ఉరవకొండ కోర్టులో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా పని చేస్తున్న వసంత లక్ష్మి, ఆమె భర్త రమేశ్‌కు రెండు వారాల రిమాండ్ విధించారు. బాలికను వేధించిన కేసులో వీరిద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు శనివారం పోక్సో కోర్టులో ప్రవేశపెట్టారు. అయితే ధర్మాసనం ఈ దంపతులతో పాటు వీరి సహాయకుడు శేఖర్‌కు కూడా 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. అయితే శేఖర్ పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు.
కాగా వసంతలక్ష్మి అనంతపురం జిల్లా ఉరవకొండ కోర్టులో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా పని చేస్తుండగా ఆమె భర్త రమేశ్ శ్రీకాకుళంలో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా పని చేస్తున్నారు. అయితే వీరి ఇంట్లో పని చేసేందుకు ఓ బాలికను మాట్లాడుకున్నారు. బాలికతో వెట్టి చాకిరి చేయించుకోవడంతో పాటు ఆమె ఒంటిపై తీవ్రంగా దాడి చేసి చిత్రహింసలకు గురి చేశారు. ఈ దాడిలో బాలిక స్పృహ కోల్పోయి పడిపోయింది. దీంతో బాధితురాలిని స్థానికులు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స అనంతరం బాలక స్పృహలోకి వచ్చి జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పారు.
దీంతో పోలీసులకు బాధితురాలి తల్లి ఫిర్యాదు చేశారు. తన కుమార్తె కాళ్లు, చేతులు, శరీరంపై తీవ్రంగా కొట్టి బాత్రూంలోకి నెట్టి గడివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. బాలిక స్పృహలోకి రావడంతో పోలీసులు వాగ్మూలం తీసుకుని నిందితులపై పోక్సో కేసు నమోదు చేశారు. అనంతరం వారిని కోర్టులో హాజరుపర్చడంతో న్యాయమూర్తి రిమాండ్ విధించారు. ఈ మేరకు నిందితులను జైలుకు తరలించారు.