- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విద్యార్థినిని నేలకేసి కొట్టిన ప్రిన్సిపాల్ భార్య : ఫీజు కట్టలేదని దుర్మార్గం
దిశ, డైనమిక్ బ్యూరో : ఏలూరు జిల్లాలో దారుణం జరిగింది. విద్యార్థి ఫీజు కట్టలేదంటూ ప్రిన్సిపాల్ భార్య విద్యార్థి పాలిట దుర్మార్గంగా వ్యవహరిస్తోంది. అన్నెంపున్నెం ఎరుగని 11 ఏళ్ల బాలుడిపై విచక్షణారహితంగా దాడికి పాల్పడింది. వివరాల్లోకి వెళ్తే నూజివీడు మండలం మీర్జాపురం న్యూ లిటిల్ ఫ్లవర్ స్కూల్ ఉంది. ఈ స్కూల్‌లో త్రినాథ్ ఆరో తరగతిలో చదువుతున్నారు. అయితే త్రినాథ్ స్కూల్ ఫీజు కట్టలేదు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రిన్సిపాల్ సతీమణి ఆగ్రహంతో రెచ్చిపోయింది. అంతే విద్యార్థిని విసిరికొట్టేసింది. అనంతరం చాతిపై తన్నింది. దీంతో విద్యార్థిని కనుబొమ్మకి, ఛాతిపైనా గాయాలు అయ్యాయి. ఈ విషయం తెలసుకున్న విద్యార్థి త్రినాథ్ తండ్రి తల్లడిల్లిపోయాడు. వెంటనే డయల్ 1902 కి విద్యార్థి తండ్రి హనుమంతరావు ఫిర్యాదు చేశారు. అనంతరం విద్యార్థి త్రినాధ్‌కి నూజివీడు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందుతుంది. ఫీజులు కట్టాలంటూ గత కొంతకాలంగా విద్యార్థులని వేధిస్తున్నారని..ఫీజు కట్టనివారిపై జులుం ప్రదర్శిస్తున్నారని విద్యార్థి తండ్రి హనుమంతరావు ఆరోపించారు. అయితే ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. విద్యార్థిపై ప్రిన్సిపాల్ సతీమణి అంతలా జులుం ప్రదర్శించిందా లేదా అనేది పోలీసులు విచారణలో తేల్చాల్సి ఉంది.