- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
బిగ్ బ్రేకింగ్.. చంద్రబాబు ఆరోగ్యంపై ప్రధాని మోదీ ఆరా
దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోగ్యంపై ప్రధాని మోదీ ఆరా తీశారు. టీడీపీ రాజ్యసభ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌ను అడిగి చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు. పార్లమెంట్- 20 భేటీలో మోదీని కనకమేడల కలిశారు. ఈ సందర్భంగా జైల్లో ఉన్న చంద్రబాబు ఆరోగ్యం ఎలా ఉందనే విషయాల గురించి మోదీ అడిగి తెలుసుకున్నారు. దీంతో బాబు ఆరోగ్య పరిస్థితి గురించి మోదీకి కనకమేడల పూర్తిగా వివరించారు.
ఈ విషయంపై కనకమేడల మీడియాతో మాట్లాడారు. చంద్రబాబుపై అక్రమ కేసులు, ఆరోగ్య విషయాలను మోదీకి తెలియజేసినట్లు ఆయన తెలిపారు. చంద్రబాబు ఆరోగ్యం గురించి మోదీ అడగ్గా.. తాను వివరించానని కనకమేడల మీడియాకు తెలిపారు. గత కొద్దిరోజులుగా ఎండ తీవ్రత వల్ల చంద్రబాబు డీహైడ్రేషన్‌కు గురి కావడం, ఉక్కబోత కారణంగా స్కిన్ అలర్జీకి గురి కావడంతో ప్రత్యేక వైద్యుల బృందం పర్యవేక్షిస్తోంది. చంద్రబాబు ఐదు కేజీల బరువు కూడా తగ్గినట్లు కుటుంబసభ్యులు చెబుతుండగా. దీనిపై జైలు అధికారులు ప్రత్యేక ప్రెస్‌మీట్ నిర్వహించి ఖండించారు. చంద్రబాబు ఇంకా ఒక కేజీ బరువు పెరిగారని సిబ్బంది తెలిపారు.
కుటుంబసభ్యుల ప్రకటన ఒకలా ఉండటం, జైలు అధికారులు మరోలా చెబుతుండటంతో చంద్రబాబు ఆరోగ్యంపై టీడీపీ శ్రేణుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. చంద్రబాబుకు ప్రమాదకర స్టెరాయిడ్స్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని లోకేష్ వ్యాఖ్యానించగా.. ప్రాణహాని ఉందని భువనేశ్వరి చేసిన చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతోన్నాయి. ఈ క్రమంలో వైసీపీ ప్రభుత్వం కూడా అలర్ట్ అయింది. బాబు ఆరోగ్యంపై రోజూ హెల్త్ బులిటెన్ విడుదల చేస్తామని తెలిపింది.