బాపట్లలో స్కూల్ ఆటో బోల్తా.. చిన్న పిల్లలకు గాయాలు

by srinivas |   ( Updated:2024-08-08 04:23:39.0  )
బాపట్లలో స్కూల్ ఆటో బోల్తా..  చిన్న పిల్లలకు గాయాలు
X

దిశ, వెబ్ డెస్క్: బాపట్లలో స్కూలు పిల్లలకు తృటిలో ప్రమాదం తప్పింది. స్కూలుకు పిల్లలను తీసుకెళ్తుండగా రోడ్డుపై ప్రమాదవశాత్తు ఆటో అదుపు తప్పి బోల్తా పడింది. వెంటనే ఆటోను స్థానికులు పైకి లేపి చిన్న పిల్లలను అందులోంచి బయటకు తీశారు. దీంతో చిన్నారులకు స్వల్పంగా గాయాలయ్యాయి. అయితే పిల్లలకు గాయాలు కావడంతో రోడ్డుపై బోరున ఏడ్చేశారు. ప్రమాదంపై పిల్లల తల్లిదండ్రులకు ఆటో డ్రైవర్ సమాచారం అందించారు. దీంతో పిల్లలను స్థానిక ఆస్పత్రిలో చికిత్స చేయించారు. పిల్లలకు ప్రమాదం తప్పడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.

Advertisement

Next Story

Most Viewed