సుప్రీంకోర్టులో ఓటుకు నోటు కేసు విచారణ వాయిదా

by Seetharam |
సుప్రీంకోర్టులో ఓటుకు నోటు కేసు విచారణ వాయిదా
X

దిశ , డైనమిక్ బ్యూరో : తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసు విచారణలో వాయిదాల పర్వం కొనసాగుతుంది. ఇప్పటికే ఈ కేసు విచారణ వాయిదాపడగా మరోనాలుగు వారాలపాటు వాయిదా వేసింది సప్రీంకోర్టు. ఈ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తరఫున వాదించే న్యాయవాది సిద్ధార్థ లూథ్రా అందుబాటులో లేకపోవడంతో విచారణను వాయిదా వేయాలని సుప్రీంకోర్టును కోరారు. దీంతో సుప్రీంకోర్టు ఈ పిటిషన్లపై విచారణను నాలుగు వారాలపాటు వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. ఇకపోతే ఓటుకు నోటు కేసు విషయమై రెండు పిటిషన్లను మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేశారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు పేరును చేర్చాలని ఒక పిటిషన్ దాఖలు చేయగా....ఓటుకు నోటు కేసు విచారణను తెలంగాణ ఏసీబీ నుండి సీబీఐకి అప్పగించాలని కోరుతూ మరో పిటిషన్ దాఖలు చేశారు. ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన రెండు పిటిషన్లపై విచారణ సుప్రీంకోర్టులో లిస్టైంది. అయితే చంద్రబాబు తరపు న్యాయవాదులు అందుబాటులో లేని విషయాన్ని ఉన్నత న్యాయస్థానం దృష్టికి తేవడంతో విచారణను కోర్టు వాయిదా వేసింది.

Advertisement

Next Story