- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏలూరు సీటు జనసేనకేనా?
దిశ, ఏలూరు: ఏలూరులో రాజకీయం రసకందాయంలో పడింది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కంచుకోటగా నిలిచిన నియోజకవర్గంలో టీడీపీ-జనసేన పొత్తు వ్యవహారం రెండు పార్టీలలోనూ ఉత్కంఠతను రేకెత్తిస్తోంది. ఏలూరులో గెలిచిన పార్టీ అధికారాన్ని చేజిక్కించుకుంటుందననేది ఓ సెంటిమెంట్. నియోజకవర్గాల పునర్విభజన జరిగిన తర్వాత కొన్ని గ్రామాలు ఏలూరు నుంచి దెందులూరు నియోజకవర్గానికి కలిసినా, గెలుపు సెంటిమెంట్ మాత్రం నిజమవుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో టీడీపీ-జనసేన కూటమి పొత్తులో ఏలూరు సీటు టీడీపీ వదులుకుని జనసేనకు కట్టబెడుతోందనే ప్రచారం జోరుగా సాగుతోంది.
ఏలూరు టీడీపీ నుంచి దివంగత మాజీ ఎమ్మెల్యే బడేటి కోటరామారావు (బుజ్జి) సోదరుడు బడేటి రాధాకృష్ణయ్య (చంటి)కు ఇస్తారని భావిస్తున్న తరుణంలో కూటమి పొత్తులో జనసేనకు సీటు వదలాలని, ఆ పార్టీ అధినేత చంద్రబాబు భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇటీవల విజయవాడలో జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పార్టీ ముఖ్య నాయకులతో పొత్తుల విషయం చర్చకు వచ్చినట్లు తెలిసింది. ఏలూరు సీటు జనసేనకు ఇస్తారని పవన్ కల్యాణ్ అన్నట్లు ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి. జనసేన నుంచి ఏలూరు సీటును ప్రస్తుత నియోజకవర్గ ఇన్‌ఛార్జ్, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా అధికార ప్రతినిధి రెడ్డి అప్పలనాయుడు ఆశిస్తున్నారు.
అయితే ఆయనకు కాకుండా ఈ స్థానంలో కొత్త అభ్యర్ధిని ఎంపిక చేస్తున్నామని పవన్ కల్యాణ్ పార్టీ ముఖ్య నాయకులతో చెప్పినట్లు తెలిసింది. ఆ కొత్త వ్యక్తి కూడా రాజకీయాలకు కొత్తవారని పార్టీ నాయకులు కొందరు అంటున్నారు. స్వచ్చంద సేవలో ఎంతో కాలంగా ఉన్న కాపు వర్గానికి చెందిన ప్రముఖుడిని ఏలూరు జనసేన అభ్యర్ధిగా బరిలో దించాలని పవన్ కల్యాణ్ భావిస్తున్నారని రాజకీయ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. ఇదే వాస్తవమైతే, తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉండి, వైసీపీ ఆధిపత్యంలోకి వెళ్లిన ఏలూరులో జనసేనకు టీడీపీ శ్రేణులు ఏ మేరకు సహకరిస్తారనేది ప్రశ్నార్ధకంగా మారింది.
మరోవైపు జనసేన టికెట్ ఆశిస్తున్న రెడ్డి అప్పలనాయుడు, మరికొందరు ఆశావహుల పరిస్థితి ఏమిటనే విషయంపై చర్చ సాగుతోంది. ఎన్నికలు సమీపిస్తుండడంతో ఇప్పుడిపుడే ఈ కొత్త రాజకీయం వాతావరణాన్ని వేడెక్కిస్తోంది.