- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Political Helmets: ఏపీలో నాయకులపై వరుసగా రాళ్ల దాడులు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న పొలిటికల్ హెల్మెట్స్
దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్ది ఆయా పార్టీల సభలు సమావేశాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. ఈ క్రమంలోనే శుక్రవారం సీఎం జగన్‌పై కొందరు ఆగంతకులు ఆయనపై రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో ఆయన ఎడమ కనుబొమ్మ పైన గాయం అయింది. దీంతో వైసీపీ నేతలు టీడీపీ అధినేత చంద్రబాబుపై ఒంటికాలిపై లేస్తున్నారు. తన నామకుడిపై రాళ్లదాడి చేయిస్తారా అంటూ రండి.. చూసుకుందాం అంటూ సవాళ్లు విసురుతున్నారు. ఆ ఘటన మరువక ముందే తాజాగా జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై ఓ గుర్తు తెలియని వ్యక్తి రాయితో దాడి చేశాడు.
అదేవిధంగా ఇవాళ విశాఖ జిల్లా గాజువాకలో చంద్రబాబు సభలో రాళ్లు కలకలం రేపాయి. ఆయన ప్రసంగిస్తుండగా ప్రజాగళం వాహనం వెనుక నుంచి ఓ అగంతకుడు రాయి విసిరి పరారయ్యాడు. దీంతో అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో పొలిటికల్ హెల్మెట్లు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఎవరికి వారుగా పార్టీల అధినేతలు వారి పార్టీ రంగు, గుర్తులు కలిగిన హెల్మెట్లు ధరించి ప్రచారం చేస్తే బాగుంటుందని నెటిజన్లు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అప్పుడు ఎవరు రాళ్లతో దాడి చేసిన ప్రణాపాయం ఉండదని, నిశ్చింతంగా ప్రచారం చేసుకోవచ్చంటూ పొలిటికల్ హెల్మెట్లను వాడాలంటూ సూచిస్తున్నారు.
ఇకపై ఏపీ నాయకులు రాళ్ళ దాడులు జరగకుండా ఈ హెల్మెట్లు వాడితే బెటర్. pic.twitter.com/VR8Fe6Atmy
— Telugu Scribe (@TeluguScribe) April 14, 2024