పోలీసుల స్పెషల్ డ్రైవ్.. 80 బైక్ సైలెన్సర్ల ధ్వంసం

by Jakkula Mamatha |
పోలీసుల స్పెషల్ డ్రైవ్.. 80 బైక్ సైలెన్సర్ల ధ్వంసం
X

దిశ, వెబ్‌డెస్క్: ద్విచక్ర వాహనాలకు భారీ శబ్దం వచ్చే సైలెన్సర్లను బిగించుకోవద్దని విశాఖ పోలీస్ కమిషనర్(Visakha Police Commissioner) శంకబ్రత బాగ్చి వాహనదారులకు సూచించారు. ఇటీవల స్పెషల్ డ్రైవ్(Special drive) నిర్వహించి బైక్ లకు అమర్చిన భారీ శబ్దం వచ్చే సైలెన్సర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిన్న (శనివారం) కమిషనర్ ఆధ్వర్యంలో ఆర్కే బీచ్ కాళీమాత ఆలయం సమీపంలో సుమారు 80 సైలెన్సర్లను రోడ్ రోలర్‌తో తొక్కించి ధ్వంసం చేశారు.

ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్(Police Commissioner) మాట్లాడుతూ.. బైక్ సైలెన్సర్లలో మార్పులు చేర్పులు చేసి భారీ శబ్దం వచ్చేలా చేయడం సరికాదని పేర్కొన్నారు. దీనివల్ల శబ్ద కాలుష్యం ఏర్పడుతుందని చెప్పారు. ఈ క్రమంలో కంపెనీ ఇచ్చే సైలెన్సర్లను మాత్రమే ఉపయోగించాలని వాహనదారులకు సూచించారు. సైలెన్సర్‌(Silencer)కు మార్పులు చేస్తే బైక్ యజమానితో పాటు దానిని బిగించిన మెకానిక్ పైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బైక్ యజమానికి 3 నెలల జైలు, రూ.10వేల వరకు జరిమానాతో పాటు 3 నెలలపాటు లైసెన్స్‌ రద్దు చేస్తామని పోలీస్ కమిషనర్ స్పష్టం చేశారు.

Advertisement

Next Story

Most Viewed