అంధ యువ‌కుడిలో గొప్ప టాలెంట్ ఉంది.. అత‌డు ఇండియ‌న్ ఐడ‌ల్‌లో పాడుతాడు : Thaman S

by Prasanna |   ( Updated:2024-11-15 15:29:56.0  )
అంధ యువ‌కుడిలో గొప్ప టాలెంట్ ఉంది.. అత‌డు ఇండియ‌న్ ఐడ‌ల్‌లో పాడుతాడు : Thaman S
X

దిశ, వెబ్ డెస్క్ : టాలెంట్ ఎవ‌రి సొత్తు కాదు. ప్ర‌తి ఒక్కరిలో ఎదోక టాలెంట్ ఉంటుంది. సోషల్ మీడియాలో కొంద‌రి టాలెండ్ చూస్తే మతి పోతుంది. తాజాగా, బ‌స్‌లో వెళ్తూ ఉండగా స‌ర‌దాగా పాడిన పాట ఓ అంధ యువ‌కుడికి సంబంధించిన నెట్టింట వైర‌ల్ అవుతోంది. అత‌డి స్వ‌రం అంద‌రి మనసులను కదిలిస్తుంది.

ఆర్టీసీ ఎండీ స‌జ్జ‌నార్ ఈ యువ‌కుడికి ఒక్క అవకాశం ఇవ్వాలంటూ సంగీత ద‌ర్శ‌కుడు ఎంఎం కీర‌వాణిని ట్విట్టర్ ద్వారా కోరారు. ‘మనం చూడాలే కానీ.. ఇలాంటి వారు చాలా మంది ఉంటారు మట్టిలో మాణిక్యాలు.. ఈ అంధ యువకుడు చాలా బాగా పాడాడు .. ఒక అవకాశం ఇచ్చి చూడండి కీరవాణి సర్‌’ అని సజ్జనార్ ట్వీట్ లో రాసుకొచ్చాడు.

ఇక తాజాగా, ఈ యువ‌కుడిని ఉద్దేశించి మ్యూజిక్ డైరెక్టర్ త‌మ‌న్ పోస్ట్ చేశారు. అత‌డు ఖ‌చ్చితంగా ఇండియ‌న్ ఐడ‌ల్‌లో పాడతాడు. నేను హామీ ఇస్తున్నాను. ఈ అబ్బాయి క‌చ్చితంగా తెలుగు ఇండియ‌న్ ఐడ‌ల్ సీజ‌న్ 4లో పాడుతాడు. గొప్ప టాలెంట్ ఉంది. అత‌డితో క‌లిసి నేను కూడా పాడ‌తాను.అతడి టాలెంట్‌ను గుర్తించి అవకాశం ఇవ్వడానికి మనం ఉన్నాం కదా ’ అంటూ త‌మ‌న్ ట్వీట్ చేసాడు.

Advertisement

Next Story