- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
రేషన్ బియ్యం మాయం కేసు: ఏ2 మానస తేజ అరెస్ట్
దిశ, వెబ్ డెస్క్: మాజీ మంత్రి పేర్ని నాని(Former Minister Perni Nani) గోదాములో 7,577 బస్తాల రేషన్ బియ్యం మాయం అయిన విషయం తెలిసిందే. అయితే పోలీసులు కేసు నమోదు చేసి పురోగతి సాధించారు. A2 నిందితుడు మానస తేజ(A2 Accused Manasa Teja)ను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆయనను విచారిస్తున్నారు. ఆయన చెప్పిన ప్రతి సమాధానాన్ని రికార్డు చేస్తున్నారు. మానస తేజ చెప్పిన దానిని బట్టి మరిన్ని అరెస్టులు ఉండే అవకాశం ఉందని అంటున్నారు. ఇక ఇదే కేసులో విచారించేందుకు మాజీ భార్య జయసుధ, కుమారుడు కిట్టు కోసం పోలీసులు గాలిస్తున్నారు. అయితే వాళ్లిద్దరూ అజ్ఞాతంలో ఉండటంతో లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు. మరోవైపు ముందస్తు బెయిల్ కోసం ఇప్పటికే కోర్టును ఆశ్రయించారు. వాళ్లు దాఖలు చేసిన పిటిషన్‌పై ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టనుంది.
ఇక ఈ కేసుపై మాజీ మంత్రి పేర్ని నాని సీరియస్ అయ్యారు. తన ఫ్యామిలీని టార్గెట్ చేశారని మండిపడ్డారు. దీంతో టీడీపీ నేతలు కూడా స్ట్రాంగ్ కౌంటర్లు వేస్తున్నారు. గత ఐదేళ్ల కాలంలో చేసిన అరాచకాలను గుర్తు చేస్తూ తీవ్ర విమర్శలు చేస్తున్నారు. దీంతో కృష్ణా జిల్లా మచిలీపట్నంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఈ నేపథ్యంలో సోమవారం కోర్టు ఏ తీర్పు ఇస్తుందో చూడాలి.